Samantha : సమంతపై మండిపడిన నాగార్జున.. అది మనస్సులో పెట్టుకుని..?

Authored By mallesh | The Telugu News | Updated on: October 11, 2022, 4:37 pm

Samantha : టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగ చైతన్య తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పి ఏడాది పూర్తి కావొస్తుంది. వీరిద్దరూ విడాకుల అనంతరం ఒకసారి కూడా ఎదురుపడలేదు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకున్నారని ఎక్కడా వార్తలు రాలేదు. ఇక సామ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నది. చైతూ కూడా తన లైఫ్‌లో బిజీ అయిపోయాడు. వీరిద్దరు విడిపోయారని తెలియగానే ఇండస్ట్రీలోనే కాకుండా పక్క ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా షాక్ అయ్యారు. సమంత అక్కినేని కుటుంబంలోకి వచ్చిన కొత్తలో కాస్త అల్లరి చిల్లరగా ఉండేదని టాక్. అయినప్పటికీ నాగ్ దంపతులు ఆమెను ఏమి అనలేదంట.

కారణం చైతూ ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి కనుక అతన్ని బాధపెట్టొద్దని కామ్‌గా ఉండిపోయారని తెలిసింది. ఇక కాలం గడుస్తున్న కొద్ది సామ్ ప్రవర్తనలో అస్సలు మార్పు కనిపించలేదంట.. దీనికి తోడు సినిమాల ఎంపిక, వెకేషన్స్, పార్టీలకు వెళ్లే విషయంలో కాస్త లిమిట్‌గా ఉండాలని చెప్పేందుకు ప్రయత్నించారట నాగ్ దంపతులు. కానీ సమంత మాత్రం అవేమి పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు ప్రవర్తించడం మొదలు పెట్టిందట. ఇంట్లో అందరితో కలిసి ఉంటే ఇలాంటి షరతులు పెడుతారని భావించి చైతూను నాగ్ కుటుంబం నుంచి సెపరేట్‌గా ఉండేందుకు ఒప్పించిందట..

Nagarjuna is angry with Samantha

Nagarjuna is angry with Samantha

Samantha : సమంత నిజంగానే అలా ఉండిందా..

వీరిద్దరూ విడిగా ఉండటం వారికి మాత్రం అస్సలు ఇష్టం లేదంట.. ఈ క్రమంలోనే సామ్ చైతూను ఒప్పించిన అనంతరం వీరిద్దరూ నాగ్ ఇంటి నుంచి చాలా దూరంగా ఓ ప్లాట్ తీసుకుని కాపురం పెట్టారు. మధ్యమధ్యలో ఇంటికి వచ్చివెళ్లేవారట.. ఈ క్రమంలోనే చైతూ కపుల్ ఇక్కడే మాతోని ఉండాలని అమల కోరిందట.. చైతూకు ఉండాలని అనిపించి సామ్‌ను అడుగగా నో చెప్పిందట.. ఇదే విషయం చిలికి చిలికి గాలి వానలా మారిందట.. దీంతో సామ్ అమల మీద ఒక్కసారిగా సీరియస్ అయ్యిందట.. ఈ విషయం తెలుసుకున్న నాగ్ సమంత మీద సీరియస్ అయ్యాడట.. ఇది మనసులో పెట్టుకున్న సమంత.. కొంతకాలం తర్వాత గొడవ చేసిందని దీంతో వీరు విడిపోయే వరకు వచ్చిందని టాక్ నడుస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp