Karthika Deepam Today Episode July 25 : కార్తీక దీపం 2 పారిజాతం చేతిలో దొరికిన ఉంగరం.. జ్యోత్స్న అబద్ధాలు బయటపడనున్నాయా?
Karthika Deepam Today Episode July 265 : స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’ సీరియల్ రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా సాగుతోంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, అనూహ్య ట్విస్టులు, దాగి ఉన్న నిజాలు ఒక్కో ఎపిసోడ్‌లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. జూలై 25న ప్రసారమైన ఎపిసోడ్‌లో జ్యోత్స్న చెప్పిన అబద్ధాలు, పారిజాతం దాచిపెట్టిన నిజం, మాలిని వేసిన కొత్త ఎత్తుగడ, కాంచన-శ్రీధర్ మధ్య భావోద్వేగ క్షణాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎపిసోడ్ ప్రారంభంలో మాలిని, జ్యోత్స్నపై తనకున్న ప్రేమను బయటపెడుతుంది. తమ కుటుంబ ఆస్తిలో తన ఆడపడుచుకు కూడా సమాన హక్కు ఉందని, అందువల్ల జ్యోత్స్న తనకు మేనకోడలేనని చెబుతూ ఆమెపై ప్రత్యేకమైన అనుబంధాన్ని చూపిస్తుంది. పారిజాతం కూడా ఆ మాటలకు మద్దతు ఇస్తూ జ్యోత్స్నపై మాలినికి ఎంత ప్రేమ ఉందో చెప్పే ప్రయత్నం చేస్తుంది.అయితే జ్యోత్స్న మాత్రం ఈ ఆప్యాయతను పట్టించుకోకుండా, తన గురించి గానీ తన పెళ్లి గురించి గానీ ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిన తర్వాత అక్కడ ఒక ఉంగరం కనిపించడంతో పారిజాతం దాన్ని తీసుకుని మాలినికి ఇస్తుంది. కానీ మాలిని ఆ ఉంగరాన్ని తిరిగి పారిజాతమే ఉంచుకోవాలని చెప్పడంతో కథలో కొత్త ట్విస్ట్‌కు బీజం పడుతుంది.మాలిని మాత్రం తనలో తాను, “ఇప్పుడే శివన్నారాయణతో ఆడుకునే అవకాశం దొరికింది” అని అనుకోవడం ఆమె ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్లు సూచిస్తుంది.
Karthika Deepam Today Episode July 25 : కార్తీక దీపం 2 పారిజాతం చేతిలో దొరికిన ఉంగరం.. జ్యోత్స్న అబద్ధాలు బయటపడనున్నాయా?
Karthika Deepam Today Episode July 25 కాంచన-శ్రీధర్ ఎమోషనల్ సీన్
మరోవైపు కాంచన ఒంటరిగా భోజనం చేస్తుండగా శ్రీధర్ ఇంటికి వస్తాడు. అతడిని చూసిన ఆనందంలో కాంచన ఒక్కసారిగా లేవబోయి తడబడుతుంది. వెంటనే శ్రీధర్ ఆమెను పట్టుకుని ప్రేమగా మాట్లాడతాడు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎంతో భావోద్వేగంగా సాగుతుంది. చాలా రోజుల తర్వాత భార్య చేతితో అన్నం తింటూ శ్రీధర్ భావోద్వేగానికి గురవుతాడు. “మళ్లీ నీ ఎదుట ఇలా కూర్చొని భోజనం చేసే రోజు వస్తుందని అనుకోలేదు” అని చెప్పడంతో కాంచన కళ్లలో ఆనందం కనిపిస్తుంది. ఈ సన్నివేశం కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ ప్రేక్షకులను కదిలించింది.ఆఫీస్‌కు తిరిగి వచ్చిన జ్యోత్స్నను చూసిన కార్తీక్, దీప, సూరజ్ ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మొబైల్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్లావని దీప ప్రశ్నించగా, “మర్చిపోయాను” అని జ్యోత్స్న సమాధానం చెబుతుంది.అయితే ఆమె మాటలను కార్తీక్ నమ్మడు. “అబద్ధం చెప్పడంలో నీకు నువ్వే సాటి” అంటూ నేరుగా ప్రశ్నిస్తాడు. ఇక్కడే సూరజ్ కూడా రంగంలోకి దిగుతూ, జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో తెలుసుకునేందుకు వరుస ప్రశ్నలు అడుగుతాడు.తలనొప్పి కారణంగా మెడిసిన్ తీసుకురావడానికి వెళ్లానని జ్యోత్స్న చెప్పినా, ఏ మెడికల్ షాప్‌కు వెళ్లావు? ఏ మందు తీసుకున్నావు? వంటి ప్రశ్నలతో సూరజ్ ఆమెను ఇబ్బంది పెడతాడు. చివరకు చైర్మన్‌కు విషయం తెలిసిపోయిందని, వెంటనే ఇంటికి రావాలని చెప్పారని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్నలో భయం మొదలవుతుంది.
Karthika Deepam Today Episode July 25 శివన్నారాయణ ఇంట్లో హైడ్రామా
ఇంటికి చేరుకున్న తర్వాత శివన్నారాయణ కుటుంబ సభ్యులందరినీ ఒకచోటికి పిలుస్తాడు. అదే సమయంలో పారిజాతం కూడా అక్కడికి రావడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారుతుంది. జ్యోత్స్నను ఎక్కడికి తీసుకెళ్లావని శివన్నారాయణ నేరుగా ప్రశ్నించడంతో పారిజాతం ఒక్కసారిగా కంగారు పడుతుంది. మొదట నిజం చెప్పాలని అనుకున్నా, జ్యోత్స్న చేసిన సైగతో వెంటనే తన మాట మార్చేస్తుంది. తాను డాక్టర్ దగ్గరకు వెళ్లానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సూరజ్ మాత్రం జ్యోత్స్న కూడా నీతో వచ్చిందా అని ప్రశ్నించడంతో పారిజాతం మరింత ఇబ్బందిలో పడుతుంది. పరిస్థితి కాస్త సద్దుమణిగిందనుకునేలోపే పారిజాతం వద్ద ఉన్న ఉంగరం కింద పడిపోతుంది. దాన్ని చూసిన శివన్నారాయణ, కార్తీక్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. “ఈ ఉంగరం ఇంతకు ముందు నీ దగ్గర చూడలేదు” అని కార్తీక్ ప్రశ్నించగా, పారిజాతం తన దగ్గర ఇలాంటి ఉంగరాలు చాలా ఉన్నాయని చెప్పి విషయం మార్చే ప్రయత్నం చేస్తుంది. అయితే సూరజ్ మాత్రం అది మాలినికి చెందిన ఉంగరమని గుర్తిస్తాడు. దీంతో జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కలిసి ఏదో దాచిపెడుతున్నారనే అనుమానం మరింత బలపడుతుంది.
పారిజాతం చెప్పిన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో సూరజ్ మరింత గట్టిగా ప్రశ్నిస్తాడు. “ఆఫీస్‌లో బాధ్యతగా లేకపోవడం చైర్మన్ అస్సలు సహించరు. ఎవరికి చెప్పకుండా మొబైల్ వదిలేసి వెళ్లడం చాలా నిర్లక్ష్యం” అని జ్యోత్స్నకు హెచ్చరిస్తాడు.పారిజాతం మాత్రం ఇది తమ కుటుంబ విషయం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సూరజ్ మాత్రం ఇది కేవలం కుటుంబ సమస్య కాదని, ఆఫీస్ క్రమశిక్షణకు సంబంధించిన విషయమని స్పష్టం చేస్తాడు.జ్యోత్స్న చెప్పిన అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడే పరిస్థితి ఏర్పడటంతో ఆమె తీవ్ర ఒత్తిడిలో పడుతుంది.
తర్వాతి ఎపిసోడ్‌లో ఏమి జరగబోతోంది?
పారిజాతం చేతిలో దొరికిన ఉంగరం కథను కొత్త మలుపు తిప్పింది. మాలిని ఉద్దేశపూర్వకంగానే ఆ ఉంగరాన్ని పారిజాతం చేతికి చేరేలా చేసిందా? జ్యోత్స్న చెప్పిన అబద్ధాలు శివన్నారాయణకు పూర్తిగా తెలిసిపోతాయా? కార్తీక్ నిజాన్ని బయటకు తీస్తాడా? అనే ఆసక్తికర ప్రశ్నలతో ఎపిసోడ్ ముగిసింది. రాబోయే ఎపిసోడ్‌లో జ్యోత్స్న ఎదుర్కోబోయే పరిణామాలు, పారిజాతం దాచిన నిజం బయటపడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.







