Namrata: మ‌హేష్ అక్కకి పిల్ల‌ల్నిక‌న‌డం అస్స‌లు ఇష్టం లేదంటూ న‌మ్ర‌త సంచ‌లన కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Namrata: మ‌హేష్ అక్కకి పిల్ల‌ల్నిక‌న‌డం అస్స‌లు ఇష్టం లేదంటూ న‌మ్ర‌త సంచ‌లన కామెంట్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :20 August 2022,5:40 pm

Namrata:మ‌హేష్ సోద‌రి మంజుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్ల‌దు. ఆమె అప్పుడ‌ప్పుడు సినిమాల‌లో కూడా క‌నిపించి సంద‌డి చేసింది.ఆమె గురించి తాజాగా న‌మ్ర‌త ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. న‌మ్ర‌త మాట్లాడుతూ..‘లైఫ్ ఇలాగే ఉండాల‌ని నేనెప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. నిజానికి నేను ఎయిర్ హోస్టెస్ కావాల‌ని అనుకున్నాను. కానీ విమాన ప్ర‌మాదాలు జ‌రుగుతాయ‌ని అమ్మ భ‌య‌ప‌డింది. తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టాను. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు కూడా దూర‌మ‌య్యాను. దానికి నాకేం బాధ లేదు. ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది. అందుక‌ని మ‌రో ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాను. టీవీ రంగంలో నిర్మాణంలోకి అడుగు పెట్ట‌బోతున్నాను. దానికి సంబంధించిన ప్రొడ‌క్ష‌న్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాను. ఆ ప‌నుల్లో బిజీగా ఉన్నాను’’ అన్నారు.

Namrata: ఇది నిజమా?

మంజుల గురించి మాట్లాడుతూ..’ఓ పార్టీలో అనుకోకుండా మంజులను కలిశాను. అప్పుడు నేను మహేశ్‌ను ప్రేమిస్తున్నట్లు ఆమెకు తెలియదు. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ అయ్యాం. తను నా బెస్ట్‌ఫ్రెండ్‌. అంతేకాదు. మేమిద్దరం ఒకేసారి ప్రెగ్నెన్సీని ధరించడం యాధృచ్చికంగా జరిగింది. నిజానికి మంజులకు పిల్లలను కనడం మొదట్లో ఇష్టమే లేదు. కానీ ఇప్పుడో కూతురు. తల్లిగా ఆమె ఎంతో ఆనందిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. న‌మ్ర‌త ప్ర‌స్తుతం మ‌హేష్ వ్య‌వ‌హారాల‌తో పాటు పిల్ల‌ల బాగోగులు కూడా చూసుకుంటుంది.

namrata comments on manjula

1993లో మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న ఆమె ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన వాస్తవ్ మూవీ నమ్రత కెరీర్లో తొలి హిట్ సినిమా. దీని తర్వాత నమ్రతకు అవకాశాలు క్యూ కట్టాయి. అలా దాదాపు 20కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.చూస్తుంటే న‌మ్ర‌త రానున్న రోజుల‌లో కూడా వెండితెర‌పై క‌నిపించే అవ‌కాశాలు చాలా తక్కువ‌గానే ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణ రంగంలోనే ఆమె కొన‌సాగాల‌ని అనుకుంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది