Bimbisara Movie effect kalyan Ram getting back to back office
Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వం లో తెరకెక్కిన బింబిసార సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో నందమూరి కళ్యాణ్రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఆయన మొదటి సారి కెరియర్లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆయన సినీ ప్రారంభించి రెండు దశాబ్దాలు కాబోతున్న ఇప్పటి వరకు ఆయన కేవలం రెండంటే రెండే సక్సెస్ లను దక్కించుకున్నాడు. ఆయన సినీ కెరీర్లో చేసిన సినిమాల ఫలితాల నేపథ్యం లో సినిమా ను జనాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా లో మేటర్ ఉంది అని అనిపిస్తుంది అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కచ్చితంగా ఈ సినిమా కళ్యాణ్ రామ్ అన్న యొక్క కెరీర్ని మార్చేస్తుంది అని, బింబిసారికి ముందు బింబిసార తర్వాత అన్నట్లుగా అన్నయ్య కెరియర్ ఉంటుంది అంటూ ఎన్టీఆర్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాంతో కచ్చితంగా ఈ సినిమాలో మేటర్ ఉండి ఉంటుందని కూడా ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కు 40 కోట్ల బడ్జెట్ అయినట్లుగా నందమూరి కళ్యాణ్ రామ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కరోనా ఇతర కారణాల వల్ల ఈ సినిమా బడ్జెట్ కాస్త అటూ ఇటూ అయితే ఉంటుంది.
nandamuri kalyan ram bimbisara movie business and budget
ఇక ఈ సినిమాను ఎంతకు అమ్మారు అనే విషయానికి వస్తే అన్ని ఏరియాల కలిపి రూ. 25 కోట్ల వరకు బిజినెస్ అయినట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ద్వారా మరో రూ. 20 కోట్ల వరకు నిర్మాతకు దక్కే అవకాశం ఉంది. అంటే సినిమా విడుదల అయ్యి యావరేజ్ టాక్ దక్కించుకున్న కూడా నందమూరి కళ్యాణ్ రామ్ కు పెద్దగా నష్టాలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ఆయన సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది. సినిమా సక్సెస్ అయి మంచి వసూలు వస్తే అప్పుడు కానీ ఆయనకు భారీ లాభాలు వచ్చే అవకాశం లేదు. మొత్తానికి నందమూరి కళ్యాణ్ రామ్ తనకున్న వనరులను ఉపయోగించుకుని సినిమాను బాగానే ప్రమోట్ చేశాడు. అలాగే బిజినెస్ చేశాడు. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది రేపటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.