Sita Ramam Movie pre release business shocking
Sita Ramam Movie : దుల్కర్ సల్మాన్ ఖాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతారామం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ను రష్యా లో తెరకెక్కించాం.. భారీ బడ్జెట్తో రూపొందించాం అంటూ ఈ చిత్రం యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాహుబలి హీరో ప్రభాస్ కూడా రావడం తో అంచనాలు భారీగా పెరిగాయి. ఇంత భారీ అంచనాలున్న ఈ సినిమాకి భారీ బడ్జెట్ అయ్యి ఉంటుందని.. కనుక 30 నుండి 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఉంటుందని అంతా భావించారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే చేసినట్లుగా తెలుస్తోంది. సీతారామం సినిమా ను ప్రేక్షకులు చూడాలని ఆసక్తితో ఉన్నారు, అయినా కూడా బయ్యర్లు ఈ సినిమా ను భారీ మొత్తానికి ఎందుకు లేదో అర్థం కావడం లేదు. ఈ సినిమా కేవలం 17 కోట్లకు అమ్ముడు పోతే 30 కోట్ల బడ్జెట్ రికవరీ ఎలా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. శాటిలైట్ ద్వారా మరో పది కోట్లు వస్తే.. ఓటీటీ ద్వారా మరో పది కోట్ల వరకు వస్తాయేమో చూడాలి. మొత్తానికి ఈ సినిమా నిర్మాతలకు లాభాలు ఎంత వరకు వస్తాయో చూడాలి.
Sita Ramam Movie pre release business shocking
సినిమా సూపర్ హిట్ అవ్వకుంటే మాత్రం నిర్మాతలకు పెద్ద నష్టం తప్పదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా లో నటించిన దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో కాకపోవడం వల్లే బిజినెస్ ఎక్కువ కావడం లేదని సమాచారం అందుతోంది. అసలు విషయం ఏంటి అనేది సినిమా విడుదలైతే కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కొన్ని గంటల్లో సీతారామం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. రష్మిక మందన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది.
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
This website uses cookies.