Bimbisara Movie : బింబిసార బడ్జెట్ ఎంత? బిజినెస్‌ ఎంత? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bimbisara Movie : బింబిసార బడ్జెట్ ఎంత? బిజినెస్‌ ఎంత?

Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వం లో తెరకెక్కిన బింబిసార సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో నందమూరి కళ్యాణ్రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఆయన మొదటి సారి కెరియర్లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆయన సినీ ప్రారంభించి రెండు దశాబ్దాలు కాబోతున్న ఇప్పటి వరకు ఆయన కేవలం రెండంటే రెండే సక్సెస్‌ లను దక్కించుకున్నాడు. ఆయన సినీ కెరీర్లో […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 August 2022,9:00 pm

Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వం లో తెరకెక్కిన బింబిసార సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో నందమూరి కళ్యాణ్రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఆయన మొదటి సారి కెరియర్లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆయన సినీ ప్రారంభించి రెండు దశాబ్దాలు కాబోతున్న ఇప్పటి వరకు ఆయన కేవలం రెండంటే రెండే సక్సెస్‌ లను దక్కించుకున్నాడు. ఆయన సినీ కెరీర్లో చేసిన సినిమాల ఫలితాల నేపథ్యం లో సినిమా ను జనాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా లో మేటర్ ఉంది అని అనిపిస్తుంది అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కచ్చితంగా ఈ సినిమా కళ్యాణ్ రామ్ అన్న యొక్క కెరీర్ని మార్చేస్తుంది అని, బింబిసారికి ముందు బింబిసార తర్వాత అన్నట్లుగా అన్నయ్య కెరియర్ ఉంటుంది అంటూ ఎన్టీఆర్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాంతో కచ్చితంగా ఈ సినిమాలో మేటర్ ఉండి ఉంటుందని కూడా ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా కు 40 కోట్ల బడ్జెట్ అయినట్లుగా నందమూరి కళ్యాణ్ రామ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కరోనా ఇతర కారణాల వల్ల ఈ సినిమా బడ్జెట్ కాస్త అటూ ఇటూ అయితే ఉంటుంది.

nandamuri kalyan ram bimbisara movie business and budget

nandamuri kalyan ram bimbisara movie business and budget

ఇక ఈ సినిమాను ఎంతకు అమ్మారు అనే విషయానికి వస్తే అన్ని ఏరియాల కలిపి రూ. 25 కోట్ల వరకు బిజినెస్‌ అయినట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ద్వారా మరో రూ. 20 కోట్ల వరకు నిర్మాతకు దక్కే అవకాశం ఉంది. అంటే సినిమా విడుదల అయ్యి యావరేజ్ టాక్ దక్కించుకున్న కూడా నందమూరి కళ్యాణ్ రామ్ కు పెద్దగా నష్టాలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ఆయన సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది. సినిమా సక్సెస్ అయి మంచి వసూలు వస్తే అప్పుడు కానీ ఆయనకు భారీ లాభాలు వచ్చే అవకాశం లేదు. మొత్తానికి నందమూరి కళ్యాణ్ రామ్ తనకున్న వనరులను ఉపయోగించుకుని సినిమాను బాగానే ప్రమోట్ చేశాడు. అలాగే బిజినెస్ చేశాడు. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది రేపటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది