Nandamuri Mokshagna : ఎట్ట‌కేల‌కి సినీ ఎంట్రీపై స్పందించిన బాల‌య్య త‌న‌యుడు.. వ‌స్తున్నా అంటూ సోష‌ల్ మీడియా పోస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nandamuri Mokshagna : ఎట్ట‌కేల‌కి సినీ ఎంట్రీపై స్పందించిన బాల‌య్య త‌న‌యుడు.. వ‌స్తున్నా అంటూ సోష‌ల్ మీడియా పోస్ట్

Nandamuri Mokshagna : నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుండో బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రేపు అంటూ తెగ ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, ఎట్ట‌కేల‌కి దీనిపై ఓ క్లారిటీ అయితే వ‌చ్చిన‌ట్టైంది. నందమూరి అభిమానులకి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట బాలకృష్ణ. ఎప్పటినుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పైగా మోక్షజ్ఞకి ఇప్పటికే 29 ఏళ్లు వచ్చేశాయి. దీంతో వీలైనంత త్వరగా వారసుడ్ని […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 July 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Nandamuri Mokshagna : ఎట్ట‌కేల‌కి సినీ ఎంట్రీపై స్పందించిన బాల‌య్య త‌న‌యుడు.. వ‌స్తున్నా అంటూ సోష‌ల్ మీడియా పోస్ట్

Nandamuri Mokshagna : నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుండో బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రేపు అంటూ తెగ ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, ఎట్ట‌కేల‌కి దీనిపై ఓ క్లారిటీ అయితే వ‌చ్చిన‌ట్టైంది. నందమూరి అభిమానులకి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట బాలకృష్ణ. ఎప్పటినుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పైగా మోక్షజ్ఞకి ఇప్పటికే 29 ఏళ్లు వచ్చేశాయి. దీంతో వీలైనంత త్వరగా వారసుడ్ని లాంఛ్ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్‌లోకి హీరోగా వదులుతున్నట్లు బాలయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు.

Nandamuri Mokshagna గుడ్ న్యూస్ వ‌చ్చేసింది..

అప్పటి నుంచి ఏ డైరెక్టర్‌తో మోక్షజ్ఞని లాంఛ్ చేస్తారా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెలిసింది. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న అతను ఇప్పుడు ఎంతో నాజుకుగా, స్టైలిష్ గా మారిపోయాడు. ఇలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా ఉన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మోక్షజ్ఞ ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని రాసుకొచ్చాడు.ప్రస్తుతం మోక్షజ్ఞ ఫొటోలు, ట్వీట్ నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. బాలయ్య కుమారుడి ఎంట్రీ ఖాయమైందంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ సినిమా అరంగేట్రం ఉంటుందని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు బాలయ్య. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తోంది.

Nandamuri Mokshagna ఎట్ట‌కేల‌కి సినీ ఎంట్రీపై స్పందించిన బాల‌య్య త‌న‌యుడు వ‌స్తున్నా అంటూ సోష‌ల్ మీడియా పోస్ట్

Nandamuri Mokshagna : ఎట్ట‌కేల‌కి సినీ ఎంట్రీపై స్పందించిన బాల‌య్య త‌న‌యుడు.. వ‌స్తున్నా అంటూ సోష‌ల్ మీడియా పోస్ట్

తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ డెబ్యూ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తారని టాక్. ఈ ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టారు ప్రశాంత్ వర్మ. అలాంటి యంగ్ డైరెక్టర్ చేతుల మీదుగా మోక్షజ్ఞను లాంఛ్ చేస్తే బావుంటుందని బాలయ్య అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు బోయ‌పాటితో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుంద‌నే టాక్ న‌డిచింది.. అధికారికంగా ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక మోక్ష‌జ్ఞ సినిమాల‌ని నిర్మించేందుకు వారిద్ద‌రి సోద‌రీమ‌ణులు పోటీ ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది