Intinti Gruhalakshmi : దివ్య కాలేజీ ఫీజు నందు కడతాడా? ఈ విషయం తెలిసి తులసి షాకింగ్ నిర్ణయం?

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, మే 16, 2022 ఎపిసోడ్ 632 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేనికైనా సంకల్ప బలం ఉండాలని.. అద ఉంటే వయసు కూడా అడ్డు కాదని జానకిని చూసి నేర్చుకుంటుంది తులసి. తను 80 ఏళ్ల వయసులో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కారులో సొంతంగా డ్రైవ్ చేస్తూ వెళ్తోంది. ప్రవళిక.. తులసికి జానకిని పరిచయం చేస్తుంది.

Advertisement

nandu and lasya insult tulasi in intinti gruhalakshmi

ఆ తర్వాత తులసి రియలైజ్ అవుతుంది. తన కళ్లు తెరిపించినందుకు ప్రవళికకు ధన్యవాదాలు తెలుపుతుంది తులసి. ఆ తర్వాత తులసికి చేదు నిజం చెబుతుంది ప్రవళిక. తనకు ఢిల్లీ ట్రాన్స్ ఫర్ అయిందని చెబుతుంది ప్రవళిక. రేపే వెళ్లిపోవాలని చెబుతుంది ప్రవళిక. కానీ.. ఫోన్ లో ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాను అని చెబుతుంది ప్రవళిక. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వను ప్రవళిక అంటుంది తులసి.

Advertisement

మరోవైపు అద్దె ఎలా కట్టాలా అని ఆలోచిస్తూ వెళ్తుంటాడు ప్రేమ్. తనను చూసి శృతి షాక్ అవుతుంది. ఎందుకంటే.. ప్రేమ్ వెళ్తున్న వీధిలోనే తన ఓనర్ తో కలిసి కిరాణ కొట్టుకు వస్తుంది శృతి. కానీ.. అదే కిరాణ కొట్టుకు టీ పౌడర్ కొందామని వస్తాడు ప్రేమ్. కానీ.. శృతిని చూడడు.

Intinti Gruhalakshmi : అభి, అంకిత మధ్య గొడవ

ఆ తర్వాత ఎందుకో మనసు మార్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్. ఆ తర్వాత అభి, అంకిత మధ్య గొడవ జరుగుతుంది. నాకు చిరాకుగా ఉంది అంటుంది.. అభి చేయి వేయగానే. మరి ఈ చిరాకు ఎప్పుడు తగ్గుతుంది అని అడుగుతాడు అభి.

నాకు తెలియదు అంటుంది అంకిత. నా మాటలు నీకు నచ్చవు.. నీ ప్రవర్తన నాకు నచ్చదు. నేను మారాలని అనుకోవడం లేదు. నీకు మారే ఉద్దేశం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అంటుంది అంకిత. గుడికి వెళ్లడానికి చీర సెలెక్ట్ చేసుకున్నావా.. ఆంటి రేపు వెళ్దామన్నారు కదా అంటాడు అభి.

ఆ తర్వాత తన కోసం చీర తీసుకొచ్చినట్టు చెబుతాడు అభి. ఎవరి డబ్బులతో చీర తీసుకొచ్చావు అని అడుగుతుంది. నేనే చీర గురించి అడుగుతున్నాను అంటాడు అభి. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం ఏంటి అని అంటాడు అభి.

కట్ చేస్తే తులసి.. స్కూటీ మీద బియ్యం బస్తా తీసుకొస్తుంది. దివ్యను త్వరగా రమ్మంటాడు పరందామయ్య. స్కూటీ మీద నుంచి దాన్ని తీసేందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నిస్తారు కానీ.. అది రాదు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. ఇంతలో నందు, లాస్య అక్కడికి వస్తారు.

బియ్యం బస్తానే మోసి ఇంట్లో వేయలేని వాళ్లు ఏం చేస్తారు ఇక అని అంటుంది. బస్తీ మే సవాల్ అని అప్పుడు సవాల్ చేసి.. ఇప్పుడేమైంది అంటుంది. మగ తోడు లేకుండానే సంసారం మోస్తాను అన్నది. ఇప్పుడు బస్తా బియ్యం కూడా మోయలేకపోతోంది. చూస్తుంటే చాలా బాధేస్తుంది నందు అంటుంది లాస్య.

ఇంతలో నందు కూడా ఏదో అనబోయేసరికి.. నిన్ను కొడుకుగా కన్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాం అంటుంది అనసూయ. దీంతో సాయం కావాలని నీ మాజీ కోడలును అడగమను.. ఓడిపోయానని ఒప్పుకోమను అంటాడు నందు. అది కాదు చెప్పేది నేను చెబుతున్నాను.. నిన్ను కొడుకుగా కని మేము పెద్ద తప్పు చేశాం అంటుంది అనసూయ.

కట్ చేస్తే రేపు దివ్య ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అని నందుకు ఫోన్ వస్తుంది కాలేజీ ప్రిన్సిపల్. మరోవైపు దివ్య ఫీజు ఎలా కట్టాలా ఆలోచిస్తూ ఉంటుంది తులసి. నందు దివ్య ఫీజు కడతాడా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Devara Trailer Review : దేవర ట్రైలర్ రివ్యూ

Devara Trailer Review : ఎన్ టీ ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మరో ఐదు రోజుల్లో…

46 mins ago

Nagarjuna : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. నాగార్జున నోట దారుణ‌మైన మాట‌లు..!

Nagarjuna  : బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజురోజుకి ర‌స‌వ‌త్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ వ‌యోలెంట్‌గా మారుతుండ‌డంతో షో మంచి మజా…

3 hours ago

Brinjal : ఈ ఐదు రకాల సమస్యలు ఉన్నవారు… వంకాయ అస్సలు తినకూడదు… ఎందుకంటే…??

Brinjal : మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తింటూ ఉంటాం. వీటిల్లో ఒకటి వంకాయ. అయితే వంకాయ అంటే చాలామందికి…

4 hours ago

Jobs in LIC : ఎల్ఐసీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. జీతం నెల‌కు రూ.30 వేలు

Jobs in LIC : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) లో…

5 hours ago

Walking : ప్రతిరోజు ఉదయం చెప్పులు లేకుండా నడిస్తే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

Walking : మనం ప్రతిరోజు కొద్దిసేపు చెప్పులు లేకుండా నడవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే చెప్పులు…

6 hours ago

Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..!

Liquor in AP  : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంతా నాసిరకమైన మద్యం అందుబాటులో ఉంచింది. అందుకే ప్రభుత్వం…

7 hours ago

Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట… అవేంటో తెలుసుకోండి…!

Kalonji Seeds Water : ప్రతి ఒక్కరి వంట గదులలో ఉండే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. అయితే సాధారణ…

8 hours ago

Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం అర్హత ప్రమాణాలు.. ఆదాయ ప‌రిమితులు..!

Ration Cards : తెలంగాణ‌లో కొత్త రేషన్‌కార్డుల జారీకి అర్హత ప్రమాణాలను పరిశీలించి సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం…

9 hours ago

This website uses cookies.