nani became emotional in shyam singaroy pre release event
Shyam Singh Roy : టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోల్లో ఒకరు నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా తన సినీ ప్రయాణాన్ని మెదలుపెట్టిన నాని.. ప్రజెంట్ నేచురల్ స్టార్‌గా టాలీవుడ్ చిత్ర సీమలో టాప్ హీరోల్లో ఒకరుగా దూసుకుపోతున్నారు. నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ ఫిల్మ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలోనూ ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నాని కీలక వ్యాఖ్యలు చేశారు.‘ట్యాక్సీవాలా’ ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన
‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంలో దివంగత లిరిసిస్ట్, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. అవి సినిమాకు హైలైట్‌గా నిలవబోతున్నాయి. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ తాను ఎక్కడకి వెళ్లినా చాలా సింపుల్‌గా వెళ్తానని, వైట్ లేదా బ్లక్ షర్ట్స్ వేసుకుని క్యాజువల్‌గా వెళ్తానని చెప్పాడు. కాగా, తాను అలా వెళ్లడాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేశారని, నాని ఏంటీ ఇప్పుడు అవే డ్రెస్సులా అని పోస్టులు పెట్టారని తెలిపారు. అవి చూసి తన భార్య తన కోసం పది సూట్లు కొన్నదని, వాటిని వేసుకోవాలని చెప్పిందని నాని పేర్కొన్నాడు.
nani became emotional in shyam singaroy pre release event
తాను జీవితంలో ఏం సాధించలేదని అనిపించిందని, అందుకే తన భార్య కొన్న సూట్‌లు అస్సలు వేసుకోలేదని తెలిపాడు. కాగా, తాజాగా తాను చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ చూసిన తర్వాత ఆ సినిమా అవుట్ పుట్ చుసి తాను సూట్ వేసుకోవచ్చు అని ధైర్యం వచ్చిందని తెలిపాడు. ఈ క్రమంలోనే తాను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్లేజర్ వేసుకొచ్చానని, ఈ పిక్చర్‌తో తనకు సూట్ వేసుకునే అర్హత వచ్చిందనుకుంటున్నానని నాని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాని భావోద్వేగానికి గురయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా సాయిపల్లవి, కృతిశెట్టి , మడోనా సెబాస్టియన్ నటించారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.