Shyam Singh Roy : ఇప్పుడు నాకు సూట్ వేసుకునే అర్హతొచ్చింది.. ‘శ్యామ్ సింగరాయ్’ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన నాని..

Authored By mallesh | The Telugu News | Published on: December 19, 2021, 6:20 pm

Shyam Singh Roy : టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోల్లో ఒకరు నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా తన సినీ ప్రయాణాన్ని మెదలుపెట్టిన నాని.. ప్రజెంట్ నేచురల్ స్టార్‌గా టాలీవుడ్ చిత్ర సీమలో టాప్ హీరోల్లో ఒకరుగా దూసుకుపోతున్నారు. నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ ఫిల్మ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలోనూ ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నాని కీలక వ్యాఖ్యలు చేశారు.‘ట్యాక్సీవాలా’ ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన

‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంలో దివంగత లిరిసిస్ట్, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. అవి సినిమాకు హైలైట్‌గా నిలవబోతున్నాయి. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ తాను ఎక్కడకి వెళ్లినా చాలా సింపుల్‌గా వెళ్తానని, వైట్ లేదా బ్లక్ షర్ట్స్ వేసుకుని క్యాజువల్‌గా వెళ్తానని చెప్పాడు. కాగా, తాను అలా వెళ్లడాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేశారని, నాని ఏంటీ ఇప్పుడు అవే డ్రెస్సులా అని పోస్టులు పెట్టారని తెలిపారు. అవి చూసి తన భార్య తన కోసం పది సూట్లు కొన్నదని, వాటిని వేసుకోవాలని చెప్పిందని నాని పేర్కొన్నాడు.

nani became emotional in shyam singaroy pre release event

nani became emotional in shyam singaroy pre release event

 Shyam Singh Roy : తాను ఎక్కడికెళ్లినా సింపుల్‌గా వెళ్తానన్న నాని..

తాను జీవితంలో ఏం సాధించలేదని అనిపించిందని, అందుకే తన భార్య కొన్న సూట్‌లు అస్సలు వేసుకోలేదని తెలిపాడు. కాగా, తాజాగా తాను చేసిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఫిల్మ్ చూసిన తర్వాత ఆ సినిమా అవుట్ పుట్ చుసి తాను సూట్‌ వేసుకోవచ్చు అని ధైర్యం వచ్చిందని తెలిపాడు. ఈ క్రమంలోనే తాను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్లేజర్ వేసుకొచ్చానని, ఈ పిక్చర్‌తో తనకు సూట్‌ వేసుకునే అర్హత వచ్చిందనుకుంటున్నానని నాని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాని భావోద్వేగానికి గురయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా సాయిపల్లవి, కృతిశెట్టి , మడోనా సెబాస్టియన్ నటించారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp