Dasara Movie : బిగ్ బ్రేకింగ్.. లీక్ అయిపోయిన దసరా సినిమా కథ .. నాని కొంప మునిగింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dasara Movie : బిగ్ బ్రేకింగ్.. లీక్ అయిపోయిన దసరా సినిమా కథ .. నాని కొంప మునిగింది !

Dasara Movie : తెలుగులో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని త్వరలోనే ‘ దసరా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో నాని పక్కా మాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కొద్ది రోజుల్లోనే థియేటర్స్ లలో విడుదల కాబోతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా సినిమాలో స్నేహానికి సంబంధించిన ట్విస్ట్ ఉండబోతుందని అంటున్నారు. ఆ ట్విస్ట్ సెన్సార్ ద్వారా బయటికి లీక్ అయింది. సహజంగా సెన్సార్ బోర్డ్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 March 2023,2:00 pm

Dasara Movie : తెలుగులో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని త్వరలోనే ‘ దసరా ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో నాని పక్కా మాస్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కొద్ది రోజుల్లోనే థియేటర్స్ లలో విడుదల కాబోతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా సినిమాలో స్నేహానికి సంబంధించిన ట్విస్ట్ ఉండబోతుందని అంటున్నారు. ఆ ట్విస్ట్ సెన్సార్ ద్వారా బయటికి లీక్ అయింది. సహజంగా సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏ సినిమా అయినా చూశాక అందులో అభ్యంతరాలు ఉంటే తీసేయమని చెబుతుంటారు.

Nani Dasara Movie story leaked

Nani Dasara Movie story leaked

ఎక్కువగా డైలాగులను పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా నాని దసరా సినిమాను సెన్సార్ బోర్డు వారు చూడడం జరిగింది. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగులను మ్యూట్ చేయాలని, కొన్ని షాట్స్ ను తొలగించాలని కోరారట. ముఖ్యంగా ఈ సినిమాలో బాడ్ కవ్, బాంచత్ వంటి బూతులను తొలగించాలని తెలిపారట. అంతేకాకుండా ఈ సినిమాలో సూరి పాత్ర చనిపోయాక డెడ్ బాడీ పై చూపించే సీన్ ను సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పింది. ఈ సినిమాలో ధరణికి సూరి అనే ఫ్రెండ్ ఉంటాడు. ఆ పాత్రను దీక్షిత్ శెట్టి చేశాడు.

Nani explains why Jersey, Ala Vaikunthapurramuloo Hindi remakes did not  work: 'It's not something audience is exploring on day 1' | Entertainment  News,The Indian Express

ఆ పాత్ర చుట్టే ఈ సినిమా కథ నడుస్తుందని లీకులు బయటకు వచ్చాయి. తాజాగా సెన్సార్ కాపీలో సూరి డెడ్ బాడీ అని ఉండడంతో సినిమా ఆ ట్విస్ట్ బయటికి వచ్చింది. సెన్సార్ కట్ చేసిన ఆ కాపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దసరాలో ఇదే మెయిన్ ట్విస్ట్ అని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో ఈ సినిమా స్టోరీ లీక్ అయిందంటూ, నాని కొంపమునిగింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా రెండు వారాలలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. పవర్ ఫుల్ యాక్షన్ లో కనిపిస్తున్న నాని సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది