
Nani : మనం అనుకుంటే రాజమౌళితో సినిమా తీసే రోజులు కావు ఇవి.. నాని ఆసక్తికర కామెంట్స్..!
Nani : నేచురల్ స్టార్ నాని వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం చిత్రం ఆగష్టు 29న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నాని ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భద్రతా బలగాలు నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో ఆత్మరక్షణ విధానాలని నేర్చుకున్నాడు. తన చేతిలో ఉన్న పిస్టల్ ను ఆ సెల్ఫ్ డిఫెన్స్ నిపుణుడు ఎంతో చాకచక్యంగా లాగేసుకోవడంతో, నాని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అవే టెక్నిక్స్ ను నాని తిరిగి ప్రదర్శించి చూపారు. ఇజ్రాయెల్ తరహా క్రోమెగా ట్రైనింగ్ తీరుతెన్నుల గురించి భద్రతా బలగాలకు చెందిన నిపుణుడు వివరించగా, హీరో నాని ఆసక్తిగా విన్నారు. అనంతరం, జవాన్లు ప్రదర్శించిన పలు ఆత్మరక్షణ మెళకువలను నాని తిలకించారు.
పోలీస్ పాత్రలో ఎప్పుడు కనిపిస్తారు అనే ప్రశ్న నానికి ఎదురైంది. దీనికి నాని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సరిపోదా శనివారం రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత నా కొత్త చిత్రం ప్రకటించబోతున్నాను. ఆ చిత్రంలో నేను పోలీస్ గానే నటిస్తున్నాను అంటూ రివీల్ చేశారు. అయితే ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ చిత్రం అయితే వెంటనే ఒకే చేస్తా. ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ తో నా దగ్గరకి వస్తే హ్యాపీ అంటూ నాని సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ పై సినిమాలు వచ్చాయి. మరి నాని ఎవరి పాత్రలో నటించాలని అనుకుంటున్నాడో అని అందరు ముచ్చటించుకుంటున్నారు.
Nani : మనం అనుకుంటే రాజమౌళితో సినిమా తీసే రోజులు కావు ఇవి.. నాని ఆసక్తికర కామెంట్స్..!
మరోవైపు నానిని రాజమౌళితో సినిమా ఎప్పుడు అని అడగ్గా.. ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. రాజమౌళిగారు అనుకుంటే అవుతుంది, మనం అనుకుంటే కాదు, రాజమౌళి గారు మనం అనుకునే లెవల్ దాటేశారు. ఇప్పుడు ఆయనతో నటించేందుకు ఇంటర్నేషనల్ లెవల్ స్టార్స్ రెడీగా ఉన్నారు. ఛాన్స్ వస్తే తప్పకుండా ఆయనతో నటిస్తానని నాని చెప్పుకొచ్చాడు. ఇక నానికి కూడా దసరా సినిమాకి సంబంధించిన ప్రశ్నలతో పాటు అనేక ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటికి సరదాగా సమాధానం ఇచ్చాడు నేచురల్ స్టార్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.