Mr Bachchan : ఏంటి.. రవితేజ హీరోయిన్ చీరలో అలా చేయి పెట్టాడు.. హరీష్ శంకర్ వివరణ..!
Mr Bachchan : మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. ఫలితంగా రవితేజ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు స్పందన ఆశించినట్లుగా దక్కలేదు.
మిస్టర్ బచ్చన్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన కూడా.. సక్సెస్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. మీడియాతో మాట్లాడారు దర్శకుడు హరీశ్ శంకర్. ఈ క్రమంలో మిక్స్డ్ టాక్ రావడంపై ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన స్పందించారు. మిక్స్డ్ రివ్యూలు కొత్తేం కాదని, ఇప్పటికే చాలా సినిమాలకు వచ్చాయని హరీశ్ శంకర్ తెలిపారు. షోలు సాగుతున్న కొద్ది మిస్టర్ బచ్చన్ మూవీకి టాక్ మారుతోందని ఆయన అన్నారు. “మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చాయి. కొత్తగా ఏముంది. నాకు నచ్చినవి కూడా ట్వీట్ చేశా. ఇది కూడా సమానంగానే ఉంది. ఇదేం కొత్తకాదు. షోల తర్వాత టాక్ పెరుగుతోంది. తర్వాత సెలవులు ఉన్నాయి. సినిమా మా అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. మా అంచనాలు దాటాలని కోరుకుంటున్నాం” అని హరీశ్ శంకర్ అన్నారు.
Mr Bachchan : ఏంటి.. రవితేజ హీరోయిన్ చీరలో అలా చేయి పెట్టాడు.. హరీష్ శంకర్ వివరణ..!
మిస్టర్ బచ్చన్ సినిమాలోని సితార పాటలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డ్రెస్‍ను రవితేజ ముందు నుంచి పట్టుకునే స్టెప్ ఉంది. అయితే, అభ్యంతకరంగా ఉందంటూ కామెంట్స్ రాగా, దీనిపై హరీశ్ శంకర్ స్పందించారు. ఈ పాటను మూవీ తొలి రోజే షూట్ చేశామని హరీశ్ శంకర్ తెలిపారు. శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద కొరియోగ్రాఫర్‌కు షూట్ ఫస్డ్ డేనే తాను చెప్పలేకపోయానని అన్నారు. “అది ఫస్ట్ డే షూట్. డ్యాన్స్ మూవ్‍మెంట్లు.. మూవ్‍లో వెళ్లిపోతే చూసేందుకు ఎబ్బెట్టుగా అనిపించవు. ఎప్పుడైతే మూవ్‍మెంట్‍ను పాస్ చేసి ఫొటోలాగా తీస్తే.. ఏ పాటలో చూసినా ఇబ్బంది కలిగేలా చేయవచ్చు. శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూట్. ఇది పెద్దగా అవసరం లేదని నాకు కూడా ఆలోచన వచ్చింది. కానీ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే వద్దంటే ఆయన నిరాశపడతారని అనుకున్నా” అని హరీశ్ శంకర్ తెలిపారు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.