Home » Entertainment » Renu Desai Emotional Comments On Pawan Kalyan Adyas Selfie
Entertainment

Renu Desai : పవన్ కళ్యాణ్ పై మాజీ భార్య రేణు దేశాయ్ ప్రేమ.. రోజు రోజుకి ఎక్కువవుతుందే కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేసింది అంటే..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 16, 2024, 6:36 pm
Advertisement

Renu Desai :  Pawan Kalyan పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఈ ఇద్దరి జంట తెర మీద ఆడియన్స్ ని అలరించి ఆ తర్వాత తెర వెనక కూడా జీవితాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ రెండో భార్యగా రేణు దేశాయ్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఐతే అకిరా నంద, ఆద్యలు పుట్టాక రేణు దేశాయ్ పవన్ నుంచి దూరం గా వెళ్లింది. ఐతే పెళ్లై విడిపోయాకా ఏ అమ్మాయి అయినా అవతల వ్యక్తి ముఖం కూడా చూడదు. కానీ పిల్లల కోసం పవన్ ను అప్పుడప్పుడు కలుస్తుంది రేణు దేశాయ్. ఐతే పవన్ కి తను దూరమైనా పిల్లలను ఆయనకు దగ్గరగా ఉంచుతుంది. అప్పుడప్పుడు పవన్ గురించి మాట్లాడుతూ ఫ్యాన్స్ ని ఖుషి చేసే రేణు దేశాయ్. ఈసారి ఎలక్షన్స్ లో ఆయనకు సపోర్ట్ గా కామెంట్స్ చేసింది. ఆయన నిజాయితీ పరుడు అంటూ రేణు ఇచ్చిన బూస్టింగ్ పవన్ పొలిటికల్ మైలేజ్ కి సపోర్ట్ చేసింది. అంతేకాదు ఆయన లాంటి నాయకుడు దొరకడం తెలుగు ప్రజల అదృష్టం అంటూ ఎలక్షన్స్ టైం లో చెప్పింది.

Advertisement

Renu Desai పవన్ ఆద్య ఒక బ్యూటిఫుల్ సెల్ఫీ..

లేటెస్ట్ గా పవన్ తో ఆద్య దిగిన ఫోటోని తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది రేణు దేశాయ్. పవన్ తో ఆద్య కలిసి దిగిన ఒక సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో పాల్గొన్న పవన్ తో కలిసి ఆద్య సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీని రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేసూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఆద్య నా దగ్గరకు వచ్చి నాన్న తో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటానని అడిగింది. ఉన్నంత వ్యక్తుల జీవితాలను ఆమె దగ్గర ఉండి చూడాలనుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ప్రజల కోసం ఆద్య నాన్న చేస్తున్న సేవలను గుర్తించి ఆద్య ఎన్నో సార్లు గర్వపడిందని రాసుకొచ్చింది.

Renu Desai : పవన్ కళ్యాణ్ పై మాజీ భార్య రేణు దేశాయ్ ప్రేమ.. రోజు రోజుకి ఎక్కువవుతుందే కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేసింది అంటే..!

Advertisement

ఐతే ఆద్య పవన్ సెల్ఫీ పై రేణు రాసుకొచ్చిన కామెంట్ కి ఆమె మళ్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని ఆమె కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి ఉంచింది. పవన్ వ్యతిరేకులు అంతా కూడా రేణు దేశాయ్ మీద కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అందుకే రేణు దేశాయ్ కొన్నిసార్లు పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తుంది. ఐతే ప్రస్తుతం ఈ సెల్ఫీ పై తన కామెంట్ కి మాత్రం మరొకరి ఉద్దేశం తనకు అక్కర్లేదు అన్నట్టుగా కామెంట్స్ ఆఫ్ చేసింది రేణు దేశాయ్.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి