
narayana comments on Bigg Boss 6 Telugu
Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది బిగ్ బాస్ షో. ఈ కార్యక్రమం రోజురోజుకి రంజుగా సాగుతుంది. షోలో సోమరితనం గురించి నాగార్జున క్లాస్ పీకడంతో బిగ్ బాస్ 6 మంచి వేగం పుంజుకుంది. కాప్స్ వెర్సెస్ దొంగ టాస్క్ ఉత్తమ ఉదాహరణ మరియు ఇది ప్రేక్షకులకు సాలిడ్ మసాలా ఇచ్చింది అని చెప్పాలి. పర్ఫార్మెన్స్ విషయం లో గీతూ రాయల్, శ్రీహన్ మరియు రేవంత్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ప్రస్తుతానికి రేవంత్ తన దూకుడు స్వభావం తో ఉన్నప్పటికీ ఓటింగ్‌లో వెనుకంజలోనే ఉన్నాడు. రోజురోజుకి ఈ షో మంచి రంజుగానే సాగుతుంది.
అయితే ఈషోపై మొదటి నుండి దారుణమైన కామెంట్స్ చేస్తూ వస్తున్న నారాయణ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల నల్గొండలో ఇద్దరు మహిళలకి గుండు కొట్టించిన సంఘటన జరిగింది. వాళ్ళు వ్యభిచారులు కాబట్టి గుండు కొట్టించాం అని అంటున్నారు. దీనిని నారాయణ తీవ్రంగా ఖండించారు. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. ఆ మహిళలు వ్యభిచారులు అయితే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు కూడా అంతే. మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ నారాయణ కాస్త గట్టిగానే ప్రశ్నించారు. . సామాన్య మహిళలకి గుండు కొట్టించి అవమానిస్తారు.. కానీ బిగ్ బాస్ షోలని మాత్రం ప్రోత్సహిస్తారు. ఇదేమి పరిస్థితి అని నారాయణ ప్రశ్నించారు. ఇక ఇటీవల నారాయణ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ..
narayana comments on Bigg Boss 6 Telugu
పెళ్ళైన వాళ్ళకి అది శోభనం గది.. మరి పెళ్లి కాని వాళ్ళకి ఏంటి అని ప్రశ్నించారు.దీనికి నాగార్జున నారాయణ, నారాయణ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ మొదలైంది మొదలు.. ఇప్పటి వరకూ చూస్తే.. గేమ్ ఛేంజర్ అంటే గీతూనే.. ఆమెది అదేం గేమ్ అని అన్నా.. ఆమె లేకపోతే ఇప్పటి వరకూ అసలు గేమే లేదు. ప్రతి ప్రోమోలోనూ ఆమే.. నాగార్జున వచ్చినప్పుడు హైలైట్ అయ్యేది ఆమే.. బిగ్ బాస్‌లో 70 కెమెరాలు ఉన్నా.. అందులో గీతు కోసం 69 కెమెరాలు పని చేస్తున్నట్టుగానే ఉంది పరిస్థితి. గీతుకి అయితే ఫుల్ ఫుటేజ్ ఇస్తున్నారు. ఆమె ఎటు తిరిగితే అటు కెమెరాలు తిప్పుతున్నారు. దానికి తగ్గట్టుగానే గీతూ కూడా పెర్ఫామెన్స్‌తో ఇరగదీస్తుంది. మరి ఈ సారి విన్నర్ కూడా ఆమె అని కొందరు జోస్యాలు చెబుతున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.