Bigg Boss 6 Telugu : బిగ్ బాస్‌లో ఉన్న వాళ్లు వ్యభిచారులు అంటూ నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్‌లో ఉన్న వాళ్లు వ్యభిచారులు అంటూ నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :22 September 2022,9:00 pm

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతుంది బిగ్ బాస్ షో. ఈ కార్య‌క్ర‌మం రోజురోజుకి రంజుగా సాగుతుంది. షోలో సోమరితనం గురించి నాగార్జున క్లాస్ పీక‌డంతో బిగ్ బాస్ 6 మంచి వేగం పుంజుకుంది. కాప్స్ వెర్సెస్ దొంగ టాస్క్ ఉత్తమ ఉదాహరణ మరియు ఇది ప్రేక్షకులకు సాలిడ్ మసాలా ఇచ్చింది అని చెప్పాలి. ప‌ర్ఫార్మెన్స్ విషయం లో గీతూ రాయల్, శ్రీహన్ మరియు రేవంత్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా నామినేషన్స్‌ లో ఉన్నారు. ప్రస్తుతానికి రేవంత్ తన దూకుడు స్వభావం తో ఉన్నప్పటికీ ఓటింగ్‌లో వెనుకంజలోనే ఉన్నాడు. రోజురోజుకి ఈ షో మంచి రంజుగానే సాగుతుంది.

అయితే ఈషోపై మొద‌టి నుండి దారుణ‌మైన కామెంట్స్ చేస్తూ వ‌స్తున్న నారాయ‌ణ తాజాగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇటీవల నల్గొండలో ఇద్దరు మహిళలకి గుండు కొట్టించిన సంఘటన జరిగింది. వాళ్ళు వ్యభిచారులు కాబట్టి గుండు కొట్టించాం అని అంటున్నారు. దీనిని నారాయణ తీవ్రంగా ఖండించారు. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తారు. ఆ మహిళలు వ్యభిచారులు అయితే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు కూడా అంతే. మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ నారాయ‌ణ కాస్త గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు. . సామాన్య మహిళలకి గుండు కొట్టించి అవమానిస్తారు.. కానీ బిగ్ బాస్ షోలని మాత్రం ప్రోత్సహిస్తారు. ఇదేమి పరిస్థితి అని నారాయణ ప్రశ్నించారు. ఇక ఇటీవల నారాయణ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ..

narayana comments on Bigg Boss 6 Telugu

narayana comments on Bigg Boss 6 Telugu

Bigg Boss 6 Telugu : దారుణం..

పెళ్ళైన వాళ్ళకి అది శోభనం గది.. మరి పెళ్లి కాని వాళ్ళకి ఏంటి అని ప్రశ్నించారు.దీనికి నాగార్జున నారాయణ, నారాయణ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ మొదలైంది మొదలు.. ఇప్పటి వరకూ చూస్తే.. గేమ్ ఛేంజర్ అంటే గీతూనే.. ఆమెది అదేం గేమ్ అని అన్నా.. ఆమె లేకపోతే ఇప్పటి వరకూ అసలు గేమే లేదు. ప్రతి ప్రోమోలోనూ ఆమే.. నాగార్జున వచ్చినప్పుడు హైలైట్ అయ్యేది ఆమే.. బిగ్ బాస్‌లో 70 కెమెరాలు ఉన్నా.. అందులో గీతు కోసం 69 కెమెరాలు పని చేస్తున్నట్టుగానే ఉంది పరిస్థితి. గీతుకి అయితే ఫుల్ ఫుటేజ్ ఇస్తున్నారు. ఆమె ఎటు తిరిగితే అటు కెమెరాలు తిప్పుతున్నారు. దానికి తగ్గట్టుగానే గీతూ కూడా పెర్ఫామెన్స్‌తో ఇరగదీస్తుంది. మ‌రి ఈ సారి విన్న‌ర్ కూడా ఆమె అని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది