Naresh – Pavithra Lokesh : ఫ్యాన్స్ నీ బకారా, కొండ వెర్రిపప్ప చేసిన నరేష్ పవిత్ర లోకేష్..!? మరి ఇంత దిగాజరాలా.!?

Advertisement

Naresh – Pavithra Lokesh : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేశ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లేందో.. వాళ్లు బయట చేసే చేష్టలు ఏంటో సోషల్ మీడియా ద్వారా జనాలు బాగానే చూస్తున్నారు. ఇప్పటికే మూడు నాలుగు పెళ్లిళ్లు అయిన నరేష్.. తాజాగా పవిత్ర లోకేశ్ తో సహజీవనం చేస్తున్నట్ట చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. నిజానికి వీళ్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చినా వాటిలో ఎలాంటి క్లారిటీ ఇప్పి వరకు అయితే రాలేదు.

అయితే.. తాజాగా కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా నరేష్, పవిత్ర లోకేశ్ ఇద్దరూ లిప్ లాక్ చేస్తూ తమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ అన్నట్టుగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలుసు కదా. పవిత్రనరేష్ అనే హ్యాష్ టాగ్ తో ఆ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. అయితే.. నిజానికి ఇదంతా నిజం కాదు. కేవలం సినిమా ప్రమోషన్ కోసం చేసిన స్టంట్ అని తాజాగా తెలిసొచ్చింది. అయితే.. ఇదంతా మళ్లీ పెళ్లి అనే సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రమోషన్ అట. నిజానికి సోషల్ మీడియా పుణ్యమాని ఉచితంగా ప్రమోషన్ చేసుకునే వెసులుబాటు అందరికీ వచ్చింది. దీన్నే చాలామంది అవకాశంగా మలుచుకుంటున్నారు. అలాగే.. గాసిప్స్ కూడా ఈరోజుల్లో రాజ్యమేలుతుంటాయి.

Advertisement
naresh and pavithra lokesh cheated people with film promotion
naresh and pavithra lokesh cheated people with film promotion

Naresh – Pavithra Lokesh : మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ కోసమేనా ఈ స్టంట్

తాజాగా నరేష్, పవిత్ర తాము సోషల్ మీడియాలో ఎలాగూ ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి.. తమ కొత్త సినిమా ప్రమోషన్ కు దాన్ని బాగా వాడుకున్నారు. అది వర్కవుట్ అయింది కూడా. మళ్లీ పెళ్లి పేరుతో ఒక సినిమా వస్తుందట. అది కూడా వాళ్ల బయోపిక్ అట. వాళ్లు ప్రస్తుతం ఏ బంధంలో ఉన్నారో.. ఆ బంధాన్ని ఎలివేట్ చేసే కథ అంటూ చెబుతున్నారు. అసలు వీళ్లు ఏ బంధంలో ఉన్నారు అనేది పక్కన పెడితే.. వెండి తెర మీద మాత్రం వీళ్లు మళ్లీ జంటగా నటిస్తున్నారు. మొత్తానికి మరోసారి వీళ్లు సినిమా ప్రేక్షకులను మోసం చేశారు. ఒక్క లిప్ లాక్ ఇచ్చి అందరినీ మోసం చేశారు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement
Advertisement