Pavitra Lokesh – Naresh : పవిత్ర లోకేష్ – నరేష్ ల పెళ్లి గురించి మహేష్ బాబు బాబాయ్ సీరియస్ కామెంట్స్ .. దారుణమైన మాట అనేసాడు పెద్దాయన..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pavitra Lokesh – Naresh : పవిత్ర లోకేష్ – నరేష్ ల పెళ్లి గురించి మహేష్ బాబు బాబాయ్ సీరియస్ కామెంట్స్ .. దారుణమైన మాట అనేసాడు పెద్దాయన..!!

 Authored By aruna | The Telugu News | Updated on :28 May 2023,11:00 am

ప్రస్తుతం టాలీవుడ్ లో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ జల్సా, మహేష్ బాబు పోకిరి, రామ్ చరణ్ ఆరంజ్ సినిమాలను ఆల్రెడీ రీ రిలీజ్ చేశారు. ఇక ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాను ఆయన బర్త్డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం స్టార్ హీరోలు అందరు తమ సినిమాలను రీ రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈనెల 31 వ తారీఖున మోసగాళ్లకు మోసగాడు సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమానం నిర్మించిన కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు పలు మీడియా ఛానల్స్ తో మాట్లాడుతూ

Adiseshagiri rao comments about Pavitra Lokesh and Naresh

Adiseshagiri rao comments about Pavitra Lokesh and Naresh

వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా కృష్ణ విజయ నిర్మల దంపతుల కుమారుడు సీనియర్ నటుడు నరేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ గారు మరణించాక పార్థివదేహాన్నో నానక్ రామ్ గూడలో ఒంటరిగా వదిలేశారని, అక్కడ నరేష్ లేడని, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోని చూసి సూపర్ స్టార్ కృష్ణ దగ్గర ఎవరూ లేకపోవడంతో అభిమానులు బాధపడ్డారని ప్రస్తావించగా దానికి బదులుగా ఆదిశేషగిరిరావు నరేష్ ఎవరు అంటూ వ్యాఖ్యానించారు. కృష్ణ పార్టీవదేహం వద్ద మా అబ్బాయి, మా మేనల్లుడు ఉన్నారు. ఆరోజుకు మహేష్ రాలేక పోతే ఎవరూ లేనట్టేనా. నరేష్ వాళ్ళ గొడవల గురించి నేను మాట్లాడను, మీరు చెప్పే వీడియోను నేను ఇంతవరకు చూడలేదు అని అన్నారు.

Adi Seshagiri Rao comments on naresh

ఇంకా ఆయన మాట్లాడుతూ రమేష్ బాబు, ఇందిరా దేవి, కృష్ణ ఒకే ఏడాదిలో కాలం చేశారు. దీంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఇక కృష్ణ ఎంత కష్టం ఉన్నా తనలోనే దాచుకుంటాడు. ముఖంలో ఏది చూపించడు. జయాపజయాలను ఏనాడు పట్టించుకోలేదు. సినీ పరిశ్రమలో అన్ని చూశారు. కృష్ణ చనిపోయాక కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. గచ్చిబౌళి స్టేడియంలో పార్థీవ దేహం ఉంచాలని ముందుగా అనుకున్నాం. కానీ మంచు ఎక్కువ పడటంతో చలి ఎక్కువగా ఉంది. పద్మాలయా స్టూడియో కృష్ణకు ఇష్టమైన స్థలం. అక్కడే అంతిమ యాత్ర ఏర్పాట్లు చేశాం. రాత్రి అంతా పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచాం. పద్మాలయలో అంత్యక్రియలు చేయాలనుకున్నా కానీ మహా ప్రస్థానంలో చేసాం. సంస్మరణ స్తూపం మహేష్ కి చెందిన స్టూడియోలో నిర్మించాలని అనుకున్నాం.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది