Nargis Fakhri : వాళ్ల కోరికలు తీర్చలేదని తొక్కేశారు.. దర్శక నిర్మాతలపై నర్గీస్ ఫక్రీ సంచలన కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nargis Fakhri : వాళ్ల కోరికలు తీర్చలేదని తొక్కేశారు.. దర్శక నిర్మాతలపై నర్గీస్ ఫక్రీ సంచలన కామెంట్స్..!

 Authored By mallesh | The Telugu News | Updated on :16 November 2021,10:00 am

Nargis Fakhri : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ -ఇంతియాజ్ అలీ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘రాక్ స్టార్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ నర్గీస్ ఫక్రీ. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్న ఈ భామ…అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ భామకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. కాగా, అందుకు గల కారణాలను తాజాగా తెలిపింది నర్గీస్.

అమెరికాకు చెందిన నర్గీస్ ఫక్రీ తొలి సినిమాతోనే స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకుంది. అయితే, తనకు కావాలనే ఆ తర్వాత కాలంలో బాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వలేదని తెలిపింది. కొందరు తనను డైరెక్ట్‌గా పడుకోవాలని అడిగారని ఓపెన్ అయింది నర్గీస్. మీటూ ఉద్యమం నేపథ్యంలో చాలా మంది తారలు తమకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుతున్న క్రమంలోనే నర్గీస్ ఫక్రీ తన విషయంలో జరిగిన అన్యాయాలను బయటకు చెప్పింది.

Nargis Fakhri About on bollywood producers

Nargis Fakhri About on bollywood producers

Nargis Fakhri : అలా నటించొద్దని ఫిక్స్ అయినా.. అలా చేశారు..

కొంత మంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ తమ కోరికలు తీరిస్తే స్టార్ హీరోయిన్ చేస్తామని అన్నారని సంచలన కామెంట్స్ చేసింది నర్గీస్. అయితే, తాను వాళ్ల కోరికలను తీర్చలేదని, అలానే ఉండిపోయానని పేర్కొంది. స్టార్ హీరోయిన్ కావాలని ఉన్నప్పటికీ న.. నటించొద్దని తాను తొలుత నిర్ణయం తీసుకున్నానని గుర్తు చేసుకుంది నర్గీస్. అలా కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే తాను స్టార్ హీరోయిన్ కాలేకపోయానని అంది నర్గీస్.

అయితే, నర్గీస్ ఫక్రీ ఆరోపణలతో బీ టౌన్‌లో కలకలం రేగింది. ఆ దర్శక నిర్మాతలెవరో అని సెలబ్రిటీలు చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ భామ స్టార్ హీరోయిన్ కాకపోయినప్పటికీ మంచి చిత్రాల్లో అయితే కీలక పాత్రల్లో కనిపించింది. ‘మద్రాస్ కేఫ్, మై తేరా హీరో, టొర్బాజ్’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన నర్గీస్.. ‘స్పై’ అనే హాలీవుడ్ ఫిల్మ్‌లోనూ నటించింది. ‘రాక్ స్టార్’ ఫిల్మ్‌లో రణ్‌బీర్ కపూర్- నర్గీస్ ఫక్రీ‌ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది