Bollywood Heroines : పాన్ ఇండియన్ సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్సే ఎందుకు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bollywood Heroines : పాన్ ఇండియన్ సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్సే ఎందుకు..?

 Authored By govind | The Telugu News | Updated on :13 April 2022,7:00 pm

Bollywood Heroines: ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే, ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ తర్వాత ఆయన కమిటవుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ రేంజ్‌లో..పాన్ వరల్డ్ రేంజ్‌లో నిర్మిస్తున్నవే. పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియన్ హీరోలుగా మారారు. ఇక ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ, దసరా సినిమాతో నేచురల్ స్టార్ లాంటి వారు పాన్ క్రేజ్ తెచ్చుకోబోతున్నారు.

అయితే, బాహుబలి సిరీస్ సమయంలో బాలీవుడ్ హీరోయిన్స్‌ను తీసుకోవాలనే ఆలోచన రాజమౌళికి రాలేదు. అప్పటి పరిస్థితులను బట్టి ఆయన అనుష్క శెట్టి, తమన్నాలను తీసుకున్నారు. అదే, ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వచ్చేసరికి ఆలియాభట్‌ను తీసుకున్నారు. ఆమె కనిపించింది కాసేపే అయినా బాలీవుడ్ మార్కెట్‌లో అలాగే, బాలీవుడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ సినిమాపై క్రేజ్ వచ్చేందుకు ఆలియా, అజయ్‌లను తీసుకున్నారు. ఇక ఇప్పుడు, ఎన్.టి.ఆర్ – కొరటాల శివ సినిమాలో ఆలియాను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ, త్వరలో ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కబో తుంది.

why only bollywood heroines in pan indian movies

why only bollywood heroines in pan indian movies

Bollywood Heroines: బాలీవుడ్‌లో మంచి బిజినెస్ జరగాలంటే..

ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ నుంచి ఆలియా తప్పుకుందని టాక్ మొదలైంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్‌గా కృతి సనన్ నటించింది. ఇప్పుడు తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె లో దీపిక పదుకొన్ హీరోయిన్‌గా నటుస్తోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ కానుంది. ఇక ఎన్.టి.ఆర్ – కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో మైత్రీ మూవీస్ పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్ దీపిక అని ప్రచారం జరుగుతోంది. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, జాక్విలిన్ ఫెర్నాండస్ – అర్జున్ రామ్ పాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఇప్పుడు జాక్విలిన్ ప్లేస్‌లో నర్గీస్ ఫక్రీ నటిస్తుందని సమాచారం. అయితే, మన తెలుగు సినిమాకు బాలీవుడ్‌లో మంచి బిజినెస్ జరగాలంటే..అక్కడ క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్..ఇతర కొన్ని పాత్రలకు ప్రముఖ నటులు కనిపించాలి. ఈ లెక్కలతోనే ఇప్పుడు మనవాళ్ళు పాన్ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్స్‌ను లాక్ చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది