National Award : పాపం ఈ సారి అల్లు అర్జున్‌కి నిరాశే.. నేషనల్ అవార్డ్ పక్కా ఆ హీరోకే ..!
ప్రధానాంశాలు:
National Award : పాపం ఈ సారి అల్లు అర్జున్‌కి నిరాశే.. నేషనల్ అవార్డ్ పక్కా ఆ హీరోకే ..!
National Award : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun పుష్ప సినిమా Pushpa Movie తో నేషనల్ అవార్డ్ National Award తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సారి పుష్ప2తో అవార్డ్ దక్కించుకుంటాడని అందరు భావించారు. కాని నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తుంది. అందుకు కారణం హీరో Vicky Kaushal విక్కీ కౌశల్. రెగ్యులర్ హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ హీరో నటించిన Chhaava Movie ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

National Award : పాపం ఈ సారి అల్లు అర్జున్‌కి నిరాశే.. నేషనల్ అవార్డ్ పక్కా ఆ హీరోకే ..!
National Award పోటా పోటి..
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు విక్కీ కౌశల్ పేరు పాన్ ఇండియా ఫిల్మ్ వర్గాల్లో మారుమోగుతుంది. అతడి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఛావా సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్ర కోసం విక్కీ కౌశల్ రూ.10 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం.
బాలీవుడ్ Bollywood స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఛావా అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సారి ఛావా సినిమాలో తన నటనతో నేషనల్ అవార్డ్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా పుష్ప2లో ఇరగదీసాడు. మరి ఎవరు అవార్డ్ అందుకుంటారో చూడాలి.