Home » Entertainment » Natural Star Nani Great Words About Allu Arjun National Award Pushpa
Entertainment

Natural Star Nani : పుష్ప సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన హీరో నాని ..!!

Authored By
aruna
The Telugu News | Updated on: October 15, 2023 6:30 pm
Advertisement

Natural Star Nani : నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ హాయ్ నాన్న ‘ . తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాని డిసెంబర్ 7న విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానం చెప్పారు. దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. కానీ అది అంతగా సక్సెస్ కాలేదు. మరి ఇప్పుడు కూడా పాన్ ఇండియా సినిమా చేయడానికి కారణం ఏంటి అని అడగక దానికి బదులుగా నాని ఏ సినిమా అయినా నేను మనసుకు నచ్చింది చేసేస్తాను. ఈరోజు వరకు చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చింది. నాకు నచ్చిందే ప్రేక్షకులకు నచ్చుతుందని భరోసా ఇచ్చారు.

Advertisement

పాన్ ఇండియా ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేయట్లేదు. నాకు కథ నచ్చితే సినిమా చేస్తాను అని బదులిచ్చారు. ఇక పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది మీరు చేసిన జెర్సీ సినిమా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కానీ మీ నటనకు అవార్డు రాలేదు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా దానికి బదులుగా బన్నీ కి నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషించాను. ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా రావటం చాలా సంతోషంగా అనిపించింది. నేషనల్ అవార్డ్స్ కోసం పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు చేయలేదు. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి చేసిన సినిమాలు. అందుకే వాటికి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అని చెప్పుకొచ్చారు.

Natural Star Nani Great Words About Allu Arjun National Award pushpa

Advertisement

ఇక శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న హాయ్ నాన్న సినిమాలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. డిసెంబర్ 7న విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో మరోసారి నాని పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో అంతగా సక్సెస్ కాలేదు మరి ఈ సినిమా అయినా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి