navdeep satirical reply to his trolls on his marriage
Navdeep : టాలీవుడ్ హీరో నవదీప్..తన కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో హీరోగా పలు సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ధ్రువ’ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఫ్రెండ్ గా నటించిన నవదీప్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘అలవైకుంఠపురములో’ ఫిల్మ్ లో బన్నీ స్నేహితుడిగానూ నటించారు. రానా హీరోగా వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలోనూ నవదీప్ కీలక పాత్ర పోషించాడు. ఆ పాత్రకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.ఇకపోతే రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘మోసగాళ్లు’ పిక్చర్ లోనూ మంచు విష్ణు దోస్తుగాను నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్ భామ సన్నీలియోన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘వీరమాదేవి’ సినిమాలో కీలక పాత్రను నవదీప్ పోషిస్తున్నాడు.
ఈ సంగతి అలా ఉంచితే.. తన పెళ్లిపై వస్తున్న ట్రోలింగ్స్‌కు గాను నవదీప్ తాజాగా వెరీ సెటైరికల్ గా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా నవదీప్‌ను కొందరు తన పెళ్లి గురించి ట్రోల్ చేస్తున్నారు. మూడు పదుల వయసు దగ్గరకు వచ్చిందని, గడ్డం తెల్లబడిపోతున్నదని నెటిజన్లు కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తాజాగా ఆ కామెంట్స్ కు నవదీప్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశాడు. సదరు వీడియోలో నవదీప్ మాట్లాడుతూ..గడ్డం తెల్లబడిపోతే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్ అని, పెళ్లి కాదని సెటైరికల్ రిప్లయి ఇచ్చాడు.
navdeep satirical reply to his trolls on his marriage
‘వద్దురా సోదరా’ అనే క్యాప్సన్‌తో వీడియో పోస్టు చేశాడు. తనకు సలహాలు ఇస్తూనే ట్రోల్ చేస్తున్నారనే విషయం చెప్పకనే చెప్పిన నవదీప్.. దురద పెడితే గోక్కుంటామని, కానీ, తోలు పీక్కోం కదా అలాగే.. ఇది కూడా అని సమాధానమిచ్చాడు. మొత్తంగా పెళ్లి చేసుకోబోనని నవదీప్ సెటైరికల్‌గా చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.