Navdeep : గడ్డం తెల్లబడితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదని ట్రోలర్స్‌కు నవదీప్ సెటైరికల్ రిప్లయి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Navdeep : గడ్డం తెల్లబడితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్.. పెళ్లి కాదని ట్రోలర్స్‌కు నవదీప్ సెటైరికల్ రిప్లయి..

 Authored By mallesh | The Telugu News | Updated on :23 January 2022,8:30 pm

Navdeep : టాలీవుడ్ హీరో నవదీప్..తన కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో హీరోగా పలు సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ధ్రువ’ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఫ్రెండ్ గా నటించిన నవదీప్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘అలవైకుంఠపురములో’ ఫిల్మ్ లో బన్నీ స్నేహితుడిగానూ నటించారు. రానా హీరోగా వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలోనూ నవదీప్ కీలక పాత్ర పోషించాడు. ఆ పాత్రకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.ఇకపోతే రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘మోసగాళ్లు’ పిక్చర్ లోనూ మంచు విష్ణు దోస్తుగాను నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్ భామ సన్నీలియోన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘వీరమాదేవి’ సినిమాలో కీలక పాత్రను నవదీప్ పోషిస్తున్నాడు.

Navdeep : తన పెళ్లిపై ట్రోల్ చేస్తున్న వారికి దిమ్మదిరిగే సమాధానిమచ్చిన నవదీప్..

ఈ సంగతి అలా ఉంచితే.. తన పెళ్లిపై వస్తున్న ట్రోలింగ్స్‌కు గాను నవదీప్ తాజాగా వెరీ సెటైరికల్ గా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా నవదీప్‌ను కొందరు తన పెళ్లి గురించి ట్రోల్ చేస్తున్నారు. మూడు పదుల వయసు దగ్గరకు వచ్చిందని, గడ్డం తెల్లబడిపోతున్నదని నెటిజన్లు కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, తాజాగా ఆ కామెంట్స్ కు నవదీప్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశాడు. సదరు వీడియోలో నవదీప్ మాట్లాడుతూ..గడ్డం తెల్లబడిపోతే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్ అని, పెళ్లి కాదని సెటైరికల్ రిప్లయి ఇచ్చాడు.

navdeep satirical reply to his trolls on his marriage

navdeep satirical reply to his trolls on his marriage

‘వద్దురా సోదరా’ అనే క్యాప్సన్‌తో వీడియో పోస్టు చేశాడు. తనకు సలహాలు ఇస్తూనే ట్రోల్ చేస్తున్నారనే విషయం చెప్పకనే చెప్పిన నవదీప్.. దుర‌ద పెడితే గోక్కుంటామని, కానీ, తోలు పీక్కోం క‌దా అలాగే.. ఇది కూడా అని సమాధానమిచ్చాడు. మొత్తంగా పెళ్లి చేసుకోబోనని నవదీప్ సెటైరికల్‌గా చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది