Naveen Polishetty : న్యూ ఇయర్ రోజు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి.. జాతిరత్నం మామూలోడు కాదు..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 1, 2023, 12:40 pm

Naveen Polishetty : జాతి రత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. డైరెక్టర్ అనుదీప్ కేవీకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విడుదలై సంవత్సరం అవుతున్నా హీరో నవీన్ పోలిశెట్టి నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే గత కొంతకాలంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమి రావడం లేదంటూ ఫ్యాన్స్ పంచులేస్తున్నారంటూ శనివారం నవీన్ పోలిశెట్టి ఓ వీడియోని రిలీజ్ చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అనకాపల్లి నుంచి అమెరికా దాక ప్రతి ఒక్కరు తన సినిమాల అప్డేట్లు ఇవ్వమంటూ అడుగుతున్నారని ఫన్నీగా తన పైన పంచ్ లు వేసుకోవడం నవ్వులు పూయిస్తున్నాయి. ఆ వీడియోలో నవీన్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ అరే ఏం చెప్పమంటావు రా జాతి రత్నాలు తర్వాత ఫ్యాన్స్ లవ్ తట్టుకోలేకపోతున్నా ఇంటి నుంచి బయటకి వెళ్ళటానికి లేదు పరిస్థితి అని అనగానే ఫ్యాన్స్ అంటూ ఇద్దరు వచ్చారు. అందులో ఒకతను నవీన్ అన్న నువ్వు ఉన్నావా చచ్చావా అనడంతో నవీన్ షాక్ తో.. ఉన్నారా..

Naveen Polishetty HILARIOUS NEW YEAR VIDEO

Naveen Polishetty HILARIOUS NEW YEAR VIDEO

షూటింగ్ చేస్తున్న, నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అని ఓ అభిమాని అడగగా దానికి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్న షూటింగ్ జరుగుతోంది అని నవీన్ అనడం వెంటనే అది అందరికీ తెలిసిందే కదా అప్డేట్ లేవు కదా అని ఫ్యాన్స్ వెళుతుండడం వారి అభిమాని కొడుకుతో కలిసి తన ఎవరో తెలుసా జాతి రత్నాలు టైంలో ఎత్తుకొని సెల్ఫీ ఇచ్చారు. అప్పుడు వీడు మూడో తరగతి త్వరగా అప్డేట్ ఇవ్వండి లేదంటే కొడుకు తార్డ్ స్టాండర్డ్ కి వచ్చేలా ఉన్నాడని అంటూ పంచ్ లు వేయడం నవ్వులు పూయిస్తుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp