Naveen Polishetty : నా పక్కన ప్రభాస్ హీరోయిన్ అనుష్క అనగానే ఈ జన్మకు చాలురా అనుకున్నా.. మాట్లాడుతూ ఏడ్చేసిన నవీన్ పొలిశెట్టి
Naveen Polishetty : నవీన్ పొలిశెట్టి అనగానే మనకు గుర్తొచ్చేది జాతిరత్నాలు సినిమా. అంతకు ముందు ఆయన చాలా సినిమాల్లో నటించినా జాతిరత్నాలు సినిమాతో తనకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ […]
Naveen Polishetty : నవీన్ పొలిశెట్టి అనగానే మనకు గుర్తొచ్చేది జాతిరత్నాలు సినిమా. అంతకు ముందు ఆయన చాలా సినిమాల్లో నటించినా జాతిరత్నాలు సినిమాతో తనకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈసందర్భంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ఏడ్చేశాడు. అసలు నేను ఏంటి అనుష్క పక్కన హీరోయిన్ గా చేయడం ఏంటి. తన రేంజ్ ఏంటి.. నా రేంజ్ ఏంటి.
తను ప్రభాస్ హీరోయిన్.. బాహుబలి హీరోయిన్.. అంటూ భావోద్వేగానికి గురయ్యాడు నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా కథ వినగానే నచ్చింది. సినిమాలో పాయింట్ చాలా కొత్తగా ఉంది. మహేశ్ ఈ కథ చెప్పడంతో చాలా ఎక్సయిట్ అయ్యాను. ఈ కథ విని ఇలాంటి సబ్జెక్ట్ చేయాలి అని అనుకున్నా. టైమ్ పట్టినా అందుకే ఈ సినిమాకే ఫిక్స్ అయ్యా. ఆ సమయంలోనే హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు అని అడిగా. దీంతో అనుష్క అనుకుంటున్నాను అని చెప్పడంతో బాహుబలి అనుష్కే కదా అని అస్సలు తట్టుకోలేకపోయా. తనతో వర్క్ చేయడం నా అదృష్టం అని చెప్పుకోవాలి.. అంటూ నవీన్ చెప్పుకొచ్చాడు.
Naveen Polishetty : జాతిరత్నాలు తర్వాత ఈ సినిమాకే రెండున్నరేళ్లు కేటాయించా
జాతిరత్నాలు తర్వాత నాకు చాలా సినిమాల ఆఫర్స్ వచ్చినా కూడా ఈ సినిమా కోసమే దాదాపు రెండున్నరేళ్లు కేటాయించా. దానికి కారణం.. ఈ సినిమా స్టోరీ. ఎంత కష్టం అయినా పర్వాలేదు.. ఈ సినిమా చేయాలి.. ఇది మరో జాతిరత్నాలు లాంటి సినిమా కావాలి అని నవీన్ పొలిశెట్టి చెప్పుకొచ్చారు. అందులోనూ ప్రభాస్ హీరోయిన్ అనుష్కతో సినిమా చేయడం అనేది నా జన్మ జన్మల అదృష్టం అంటూ స్టేజీ మీదనే ఏడ్చేశాడు నవీన్ పొలిశెట్టి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.