Navya Swami : అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి
Navya Swami : బుల్లితెర హీరోయిన్ నవ్యస్వామి Navya Swami గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నడ సుందరి అయినా కూడా తెలుగమ్మాయిలా మారిపోయారు. తెలుగు నేర్చుకుంది. ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుతూ ఉంటుంది. అలా మొత్తానికి నవ్యస్వామికి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇక నవ్యస్వామి ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటుంది. రవికృష్ణ, నవ్యస్వామి మధ్య ఏదో ఉందనేట్టుగా క్రియేట్ అయింది.

Navya Swami About Suma In Tenali Double Horse Interview
సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి Navya Swami
ఆమె కథ సీరియల్‌తో పాటు ఇతర షోల్లోనూ సందడి చేయడంతో రవి కృష్ణ నవ్యస్వామి జంటపై రకరకాల రూమర్లు రావడం మొదలుపెట్టాయి. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ రూమర్లు వచ్చాయి. అయితే తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ రూమర్లు మాత్రం ఆగడం లేదు.

Navya Swami About Suma In Tenali Double Horse Interview
తాజాగా నవ్యస్వామి తెనాలి డబుల్ హార్స్ ప్రొడక్ట్‌కు అంబాసిడర్‌గా మారారు. ఈ క్రమంలో అనుబంధం అంటూ సుమ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఈ షోలో ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ అనేక విషయాలు పంచుకున్నారు. బయట ఎక్కడ కనిపించినా కూడా పెళ్లి, రిలేషన్ గురించి అడుగుతూ ఉంటారు.. రవికృష్ణకు నాకు రిలేషన్ ఉందని అనుకుంటారు.. ఎప్పుడూ కూడా అవే ప్రశ్నలు అడుగుతుండేవారు. అయితే మొదట్లో ఎలానో అనిపించినా కూడా ఇప్పుడు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు ఎవ్వరైనా అలా అడగకపోతే.. ఏంటి ఇంకా అడగడం లేదు అని ఎదురుచూస్తున్నాను అని నవ్యస్వామి Navya Swami సుమ Anchor Suma తో చెప్పుకొచ్చింది.