Nayanatara : విడాకులకు సిద్ధమైన నయనతార – విగ్నేష్ శివన్… అసలు ఏం జరిగిందంటే..?

Authored By Ramu | The Telugu News | Published on: March 10, 2024, 8:00 pm
  •  Nayanatara : విడాకులకు సిద్ధమైన నయనతార - విగ్నేష్ శివన్...అసలు ఏం జరిగిందంటే..?

Nayanatara : సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ తీసి చూస్తే దానిలో ముందుగా లేడీస్ సూపర్ స్టార్ నయనతార మరియు విగ్నేష్ జంట కచ్చితంగా ఉంటుందని చెప్పాలి. అయితే వీరిద్దరూ ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత 2022లో పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో నయనతార నటించడం జరిగింది. ఇక ఈ సినిమాతోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది అని చెప్పాలి. ఇక అప్పటినుండి దాదాపు 7 ఏళ్ల పాటు వీరిద్దరూ ప్రయాణం సాగించారు. ఇక ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని 2022లో ఫైనల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది.వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలోని స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ఈ విషయంపై సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి . దీనిపై న్యాయపరమైన చిక్కులు కూడా ఏర్పడ్డాయి. ఇక వాటన్నిటిని దాటుకుని విగ్నేష్ నయనతార వారి పిల్లలతో కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ విధంగా నయనతార విగ్నేష్ ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ ను లీడ్ చేస్తూనే కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ విధంగా పర్ఫెక్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ దంపతులు ఎంతోమందికి ఆదర్శమని చెప్పాలి. అలాంటి ఈ జంట మధ్య కూడా ఇప్పుడు గొడవలు తలెత్తుతున్నాయని వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలు ఇలా ప్రచారం కావడానికి ఒక బలమైన కారణం ఉందని చెప్పాలి. అయితే పిల్లలు పుట్టిన తర్వాత నయనతార తిరిగి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇంస్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు 78 లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే ఇటీవల నయనతార ఎవరు ఊహించని విధంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన భర్త విగ్నేష్ ను ఆన్ ఫాలో చేసింది.

అంతేకాక ఇంస్టా స్టోరీలోకన్నీళ్లు ఉబికి వస్తున్న కూడా ఇదే నాకు మిగిలింది అంటూ ఓ ఎమోషనల్ కొటేషన్ రాసుకొచ్చింది. దీంతో క్షణాల్లోనే నాయనతార పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయింది. దీంతో ఆమె అభిమానులు కూడా తెగ కంగారు పడిపోయారు. అసలు నయనతార విగ్నేష్ మధ్య ఏం జరిగింది..? ఎందుకు నయనతార తన భర్తను అన్ ఫాలో చేసింది..? ఈ జంట కూడా త్వరలోనే విడిపోతున్నారా..? అంటూ సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ విధంగా చర్చలు జాగుతున్న సమయంలో నయనతార మరో బిగ్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఇంస్టాగ్రామ్ లో భర్తను మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో నయనతార అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే నయనతార ఏదో పొరపాటున తన భర్తను అనుఫాలో చేసి ఉంటుందని కొందరు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Ramu

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp