Nayanthara : గుడ్ న్యూస్.. ఎట్ట‌కేల‌కు న‌య‌న‌తార పెళ్లి తేది ఫిక్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nayanthara : గుడ్ న్యూస్.. ఎట్ట‌కేల‌కు న‌య‌న‌తార పెళ్లి తేది ఫిక్స్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :7 May 2022,12:30 pm

Nayanthara : లైఫ్ లో పలుమార్లు బ్రేక‌ప్ చేస్తున్న న‌య‌న‌తార ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంది. అద్భుతమైన నటనతో ఆరంభంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె.. క్రమంగా వరుస విజయాలను అందుకుని స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో తన పర్సనల్ లైఫ్‌ను కూడా నయన్ ఎంతో ఎంజాయ్ చేస్తోంది. సినిమాల పరంగా నయనతార ఎంత సక్సెస్ అయిందో.. ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం పలుమార్లు విఫలమైంది. గతంతో ఓ స్టార్ హీరోతో పాటు ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన ఈమె.వాళ్లిద్దరితో బంధాన్ని మధ్యలోనే ఆపేసింది.

ఇలా రెండు బ్రేకప్‌ల తర్వాత ఇప్పుడు ఆమె విఘ్నేష్ శివన్ అనే కోలీవుడ్ డైరెక్టర్‌తో లవ్వాట మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈసారి తమ బంధాన్ని స్ట్రాగ్ చేసుకుంటూ.. పెళ్ళి పీఠల వరకూ వెళ్తున్నారు. వచ్చేనెల 9న పెళ్ళి బంధంతో ఈఇద్దరు ఒకటి కాబోతున్నట్టు తెలుస్తోంది. విఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న ఈజంట.. ఇక్కడే తిరుమలలో పెళ్ళి చేసుకోబోతున్నారట. ద‌ర్శ‌నంతో పాటు..తమ పెళ్ళికి వేదికను బుక్ చేసుకోవడం కోసం తిరుమలకు వచ్చినట్టు తెలుస్తోంది.విఘ్నేష్ శివన్‌తో నయనతార చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోన్నా.. పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు వీళ్లు వివాహం చేసుకుంటారా? లేదా?

Nayantara wedding date fix

Nayantara wedding date fix

Nayanthara : పెళ్లికి వేళాయే.

అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించింది. ఇక, కొద్ది రోజుల క్రితమే నుదుటిపై బొట్టుతో కనిపించింది. దీంతో వీళ్ల పెళ్లి అయిందని వార్తలు వచ్చాయి. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్.. నయనతార, సమంత, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో ‘కాథువాక్కుల రెండు కాదల్’ అనే సినిమాను తెరకెక్కించాడు. KRK టైటిల్‌తో తెలుగులోనూ ఈ సినిమా విడుదలైంది. అయితే, దీనికి మాత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు అనుకున్న రీతిలో రాలేదు. అయితే, ఇందులో నటనకు గానూ అందరికీ ప్రశంసలు వచ్చాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది