Nayantara : రైజింగ్ స్టార్‌ను దారుణంగా అవమానించిన నయనతార.. నీకా అర్హత లేదంటూ!

Authored By mallesh | The Telugu News | Published on: December 29, 2021, 6:20 pm

Nayantara: స్టార్ యాక్ట్రెస్ నయనతార గురించి ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్నిఓ ఊపు ఊపేస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. హిట్స్ ప్లాపులతో ఈ బ్యూటీకి సంబంధం లేదు. ఈ విధంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నయన్ పాగా వేసింది. ఒకప్పుడు సీనియర్ హీరోలతో నటించేందుకు చాలా మంది ఏజ్డ్ హీరోయిన్లు ఉండేవారు. ప్రస్తుతం కొందరు పెళ్లిళ్లు చేసుకుని సెట్ అయ్యారు. శ్రియ, కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా సెటిల్ అయ్యారు. త్రిష కోలివుడ్‌కే పరిమితం అయ్యింది. నటి స్నేహకు ఇద్దరు పిల్లలు.. ఆమె ప్రస్తుతం హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా తల్లి, అక్క పాత్రలు చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త నీరు వచ్చి చేరింది. పాత నీరు వెళ్లిపోయింది.

Nayantara Who Insulted the Rising Star Badly

Nayantara Who Insulted the Rising Star Badly

Nayantara : రెండు ఇండస్ట్రీల్లో నయన్ దూకుడు..

కొందరు హీరోయిన్లకు చాలా తక్కువ ఏజ్ ఉంటుంది. సీనియర్ హీరోలతో జోడి కట్టేందుకు వారు రెడీగా ఉన్నా ఆడియెన్స్ ఏమనుకుంటారో అని దర్శకనిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నయన్ మాత్రమే అందరూ సీనియర్ హీరోలతో చేసింది. దీంతో మూవీమేకర్స్ సీనియర్ హీరోలతో సినిమా అంటే ముందుగా ఆమెనే సంప్రదిస్తున్నారట.. అయితే, ప్రమోషన్స్‌కు హాజరుకానని ఈ భామ ముందే తెగేసి చెబుతున్నా దర్శక నిర్మాతలు అయిష్టంగానే ఓకే అంటున్నారట..

తాజాగా నయన్ తార మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెల్లెలి క్యారెక్టర్ చేస్తోంది. ఇందులో నయర్ భర్తగా సత్యదేవ్‌ను ఎంచుకున్నారు మూవీమేకర్స్. అయితే, తనతో నటించే అర్హత సత్యదేవ్‌కు లేదని, ఎవరైనా సీనియర్ నటుడిని పెట్టాలని నయన్ కండిషన్ పెట్టిందటని రూమర్లు వినిపిస్తున్నాయి. కాకపోతే సినిమాలో చిరు తర్వాత పవర్ రోల్ సత్యదేవ్ దే అని దర్శకుడు చెప్పినట్టు తెలుస్తోంది. మళయాలం మూవీ లూసీఫర్‌కు రీమెక్ గాడ్ ఫాదర్.. అందులో మోహన్ లాల్ సిస్టర్ గా మంజువారియర్ యాక్ట్ చేస్తే ఆమె భర్తగా బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కీలక పాత్ర పోషించారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp