MSG Collections | బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా మానియా.. తొలి రోజు ఫైరింగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోయిన చిరు చిత్రం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MSG Collections | బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా మానియా.. తొలి రోజు ఫైరింగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోయిన చిరు చిత్రం

 Authored By sandeep | The Telugu News | Updated on :13 January 2026,7:52 am

ప్రధానాంశాలు:

  •  MSG Collections | బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా మానియా.. తొలి రోజు ఫైరింగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోయిన చిరు చిత్రం

MSG Collections | బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్ ఓపెనింగ్స్‌తో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) ఇప్పటికే ప్రీమియర్స్ నుంచే రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. టాలీవుడ్ సీనియర్ హీరోలలోనే ఈ స్థాయిలో ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకున్న చిరంజీవి, ప్రీమియర్స్‌తో పాటు డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు 36 కోట్ల రూపాయల రేంజ్‌లో గ్రాస్ వసూళ్ల మార్క్‌ను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక విడుదల రోజు ఉదయం నుంచి అన్ని థియేటర్లలో బుకింగ్స్ ఫుల్‌గా నడవడం, హౌస్‌ఫుల్స్ పడటం విశేషంగా మారింది.

Mana Shankara Vara Prasad Garu సంక్రాంతి బరిలో మన శంకరవరప్రసాద్ గారు క్లైమాక్స్ లీక్‌తో పెరిగిన హైప్

 

ప్రస్తుతం ఉన్న ప్రీ బుకింగ్స్ ట్రెండ్‌ను బట్టి చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 28–30 కోట్ల రూపాయల షేర్ ఓపెనింగ్స్‌ను సేఫ్ సైడ్‌గా అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో సినిమా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంటుండటంతో కలెక్షన్లు అంచనాలను మించేలా కనిపిస్తున్నాయి. ఈవెనింగ్, నైట్ షోలకు కూడా ఇదే స్థాయి ట్రెండ్ కొన‌సాగిన నేప‌థ్యంలో వసూళ్లు మరింత పెరిగాయ‌ని అంటున్నారు.. మొత్తంగా చూస్తే, టాలీవుడ్‌లో సీనియర్ హీరోల సినిమాల పరంగా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా డీసెంట్ హోల్డ్‌ను చూపిస్తుండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం ఎక్స్‌లెంట్ స్టార్ట్‌ను నమోదు చేసింది. దీంతో వరల్డ్‌వైడ్‌గా ప్రీమియర్స్ + డే 1 కలిపి సినిమా సెన్సేషనల్ స్టార్ట్ సాధించే దిశగా దూసుకుపోతోంది.

సేఫ్ సైడ్ లెక్కల ప్రకారం చూస్తే, ఈ చిత్రం 40 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. ఇక ఈవెనింగ్, నైట్ షోల ట్రెండ్‌ను బట్టి ఈ కలెక్షన్లు ఎంత దూరం వెళ్తాయన్నది ఇప్పుడు అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. నిర్మాణ విలువలు, కథన శైలి, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కలిసివచ్చి ‘మన శంకర వరప్రసాద్ గారు’ను పండుగ స్పెషల్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయని చెప్పొచ్చు. మొత్తానికి, చిరంజీవి వింటేజ్ ఫామ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, స్టార్ క్యాస్టింగ్ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ దిశగా తీసుకెళ్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది