Nayanthara : పెళ్లి త‌ర్వాత న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్‌ల‌కి వ‌రుస క‌ష్టాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nayanthara : పెళ్లి త‌ర్వాత న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్‌ల‌కి వ‌రుస క‌ష్టాలు

Nayanthara: సాధార‌ణంగా పెళ్లి అయిన త‌ర్వాత ఏ జంట అయిన స‌ర‌దాగా సంతోషంగా ఉంటారు. పెళ్లి త‌ర్వాత హ‌నీమూన్‌కి వెళ్ల‌డం అక్క‌డ స‌ర‌దాగా గ‌డ‌ప‌డం, ఓ నెల రోజులపాటు షికార్లు తిర‌గడం వంటివి చేస్తూ హ్య‌పీగా గడుపుతుంటారు. అయితే న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్‌ల‌కి పెళ్లైన త‌ర్వాతి రోజు నుండి క‌ష్టాలు మొద‌లయ్యాయి. ఒక‌టి అయిపోయింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రొక‌టి వ‌స్తుంది. తాజాగా రూ. 25 కోట్లను తిరిగి చెల్లించాలని నెట్ ఫ్లిక్స్ ఈ జంటకు నోటీసులు జారీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 July 2022,12:00 pm

Nayanthara: సాధార‌ణంగా పెళ్లి అయిన త‌ర్వాత ఏ జంట అయిన స‌ర‌దాగా సంతోషంగా ఉంటారు. పెళ్లి త‌ర్వాత హ‌నీమూన్‌కి వెళ్ల‌డం అక్క‌డ స‌ర‌దాగా గ‌డ‌ప‌డం, ఓ నెల రోజులపాటు షికార్లు తిర‌గడం వంటివి చేస్తూ హ్య‌పీగా గడుపుతుంటారు. అయితే న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్‌ల‌కి పెళ్లైన త‌ర్వాతి రోజు నుండి క‌ష్టాలు మొద‌లయ్యాయి. ఒక‌టి అయిపోయింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రొక‌టి వ‌స్తుంది. తాజాగా రూ. 25 కోట్లను తిరిగి చెల్లించాలని నెట్ ఫ్లిక్స్ ఈ జంటకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మ‌రి అస‌లు ఈ వివాదం ఏంట‌నేది తెలియాలంటే వీడియో చూడాల్సిందే..!

అందాల నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత ఇటీవలే ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్- షారూక్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ప్యాకేజీ కి కొనుగోలు చేసింది. ఈవెంట్ ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తనదైన విజన్ తో డాక్యుమెంటరీగా తెరకెక్కించారు. అనుకున్న విధంగానే షూట్ చేయడం కూడా జరిగింది.

Nayanthara And vignesh shivan facing problems after marriage

Nayanthara And vignesh shivan facing problems after marriage

కాగా సడెన్‌గా నెట్ ఫ్లిక్ సంస్థ నయన్ విఘ్నేష్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుని బిగ్ షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.ఒప్పందం ప్రకారం నయన్, విగ్నేష్‌ల పెళ్లి ఫోటోలను బయటకు రాకుండా చూసుకోవాలట. పెళ్లి జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే, పెళ్లికి సంబంధించి కీలకమైన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఒప్పందానికి కట్టుబడి ఉండకుండా.. పర్మిషన్ అడగకుండా పెళ్లి ఫోటోలను లీక్ చేశారని నెట్ ఫ్లిక్స్ సంస్థ వీడియో టెలికాస్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందని తాజా టాక్ నడుస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ సంస్థ డీల్ క్యాన్సల్ రద్దు చేసుకోవడంతో..

పెళ్లి కోసం ఖర్చుపెట్టిన మొత్తాన్ని, అంతేకాదు ఒప్పందం ప్రకారం మాట్లాడుకున్న రూ. 25 కోట్లను తిరిగి చెల్లించాలని నెట్ ఫ్లిక్స్ ఈ జంటకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి ఈవెంట్ ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తనదైన విజన్ తో డాక్యుమెంటరీగా తెరకెక్కించారు. ఈ డాక్యు సినిమాని త్వరలోనే నెట్ ఫ్లిక్స్ విడుదల చేయనుంది.ఇంకా పేరు పెట్టని ఈ డాక్యు సినిమాలో నయనతార – విఘ్నేష్ ల ప్రేమకథను అందంగా చూపించనున్నారు. జూన్ 9న తమిళనాడు- మహాబలిపురంలోని ఒక పాపులర్ రిసార్ట్ లో వివాహంతో ముగిసే ఈ వీడియోలో రియల్ ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

Nayanthara And vignesh shivan facing problems after marriage

Nayanthara And vignesh shivan facing problems after marriage

స్క్రిప్ట్ లేని కంటెంట్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అభిమానులకు అందించడంలో మా ప్రత్యేకత వేరు. దేశవిదేశాల్లో ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే శక్తి మాకు ఉంది. అందరికీ ఈ డాక్యు సినిమా అందుబాటులోకి తెస్తున్నామని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు వెల్లడించారు. దాదాపు 20 సంవత్సరాల కెరీర్ లో నయనతార రియల్ సూపర్ స్టార్. మా అద్భుతమైన సృజనాత్మక భాగస్వాములు దర్శకుడు గౌతమ్ మీనన్ – రౌడీ పిక్చర్స్ కి ధన్యవాదాలు. విఘ్నేష్ తో వివాహానికి దారితీసిన నయనతార ప్రయాణాన్ని ఎట్టకేలకు సినిమాగా వీక్షించేందుకు వేచి ఉండలేం.. అని నెట్ ఫ్లిక్స్ అధినేతలు గ‌తంలో ప్రకటించారు. కాని ఇప్పుడు ఈ వివాదంతో ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయ‌న్న‌ది వేచి చూడాలి.

ఈ జంట రీసెంట్‌గా థాయ్ లాండ్‌కు హనీమూన్‌కు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అది అలా ఉంటే నయన్ అప్పుడే భర్తకు బై బై చెప్పి.. షూటింగ్‌లకు మళ్ళీ సిద్దం అయ్యింది. నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి గాడా ఫాదర్‌తో పాటు హిందీలో అట్లీ దర్శకత్వంలో వస్తున్న షారుఖ్‌ ఖాన్‌ ‘జవాన్‌’‌లో కీలకపాత్రలో నటిస్తున్నారు. న‌య‌న‌తార‌ బిజినెస్ లోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. బ్యూటీ ప్రాడక్ట్స్ బిజినెస్ ను ప్రారంభించింది నయనతార. ఆమె ‘ది లిప్ బామ్ కంపెనీ’ పేరుతో రీటైల్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్ తో కలిసి ఈ బిజినెస్ ను ఆమె ప్రారంభించింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది