Home » Entertainment » Nayanthara Boyfriend Vignesh Shivan Dream Destination
Entertainment

Nayanthara : అక్కడికి వెళ్లాలని ఉందట.. నయన్ ప్రియుడి కోరికలు మామూలుగా లేవు!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: November 7, 2021, 6:10 am
Advertisement

Nayanthara : నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచి దర్శకుడు, అంతకంటే మంచి అభిరుచి ఉన్న నిర్మాత, పాటల రచయిత. ఇలా ఎన్నో రకాల టాలెంట్లున్నాయి. అయితే విఘ్నేశ్ శివన్ మాత్రం నయన్ ప్రియుడిగానే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. కోలీవుడ్‌లో విఘ్నేశ్ శివన్ సినిమాలకు ఓ మార్క్ ఉంటుంది. నాను రౌడీదానే (నేనూ రౌడీనే) అంటూ వచ్చిన చిత్రంతో నయనతార హీరోయిన్‌గా విఘ్నేశ్ దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టారు.

Advertisement

nayanthara boyfriend vignesh shivan dream destination

అలా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నయన్‌ను ప్రేమలోకి దించేశాడు విఘ్నేశ్. అలా అప్పటి నుంచి వీరి ప్రేమాయణం ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది. మధ్యలో ఎన్నెన్నో కథనాలు వచ్చాయి. అయితే ఈ ప్రేమకు ఆరేళ్లు అవుతున్నా కూడా పెళ్లి పీటల వరకు వెళ్లడం లేదు. అసలు వెళ్తుందా? అనే అనుమానం కూడా జనాల్లో ఉంది. అయితే ఈ దీపావళిని నయన్, విఘ్నేశ్ శివన్‌లు ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టున్నారు.

Advertisement

Nayanthara : నెటిజన్లతో విఘ్నేశ్ ముచ్చట్లు..

nayanathara-says he is her husband

ఇద్దరూ కలిసి క్రాకర్స్ కాల్చిన వీడియోలను కూడా విఘ్నేశ్ శివన్ షేర్ చేశాడు. అయితే తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టాడు. పది ప్రశ్నలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను.. వాటికే సమాధానాలు ఇస్తాను అని అన్నాడు. మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏంటని? ఓ నెటిజన్ అడిగాడు. దానికి చంద్రమండలం అని సమాధానం ఇచ్చాడు విఘ్నేష్. అలా చంద్రుని మీదకు వెళ్లాలని తన కోరికను ఇలా బయటపెట్టేశాడు. అయితే అక్కడి కూడా నయనతారను తీసుకెళ్తాడేమో మరి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి