Nayanthara : గర్భం దాల్చకుండా కవలపిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు?

Authored By mallesh | The Telugu News | Published on: October 10, 2022, 10:30 am

Nayanthara : ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న నయన‌తార తన అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. రీసెంట్‌గా వివాహం చేసుకున్న విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నయన్ భర్త విఘ్నేశ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దీంతో నయన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వారిలో ఎక్కడో అనుమానం కూడా రేకెత్తింది. ఎందుకంటే తమ అభిమాన నటికి పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలే అవుతోంది. నయనతార తల్లి అయ్యిందని తెలిసి సంతోషించే వారు ఎంత మంది ఉన్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా కొత్త చర్చ నడుస్తోంది. నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమ వివాహం చేసుకుందని అందరికీ తెలుసు.

వీరిద్దరూ దంపతులుగా మారి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. అయితే, అప్పుడే వీరిద్దరూ ఎలా పేరెంట్స్ అయ్యారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.కానీ ఎవరినీ పిలువకుండా చేసుకున్నారు. వీరి పెళ్లి వీడియోలను నెట్ ఫ్లిక్స్ సంస్థ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంది. అయితే, తమ పెళ్లి దృశ్యాలను కూడా ఓటీటీకి నయన్ దంపతులు అమ్ముకోవడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. మరికొందరు మాత్రం బిజినెస్ ఎలా చేయాలో ఈ దంపతులకు బాగా తెలుసని కామెంట్స్ చేశారు. తాజాగా నయన్ దంపతులు పండంటి కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారని తెలియగానే అంతా షాక్ అవుతున్నారు. నయన్ ఓవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది.

Nayanthara couple gave birth to twins

Nayanthara couple gave birth to twins

Nayanthara : నాలుగు నెలల్లోనే కవలపిల్లలు ఎలా..

గర్భం దాలిస్తే ఇప్పటికే జనాలకు తెలిసేది. కానీ అలాంటిది ఏమీ లేదు. గర్భం కనిపించకుండా ఎవరూ దాచలేరు. నయన్ పెళ్లికి ముందే కమిట్ అయ్యిందని అనుకుంటే అలియా భట్ లాగా రివీల్ చేసి తన బేబీ బంప్‌ను చూపించేది కదా.. అది కూడా జరగలేదు. మరి ఎలా తల్లి అయ్యిందని అందరికీ అనుమానం రావడంతో అసలు విషయాన్ని తన భర్త తెలిపాడు. తామిద్దరం సరోగసి ద్వారా పేరెంట్స్ అయ్యామని.. పెళ్లికి ముందే దీని గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామని.. దాని ఫలితమే కవలపిల్లలు జన్మించారని పేర్కొనడంతో అంతా షాక్ అవుతున్నారు. గర్భం దాల్చకుండా నయన్ మాతృత్వం ఫీలింగ్ ఎలా పొందుతుందని.. గ్లామర్ దెబ్బతింటుందని ఇలా చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp