Nayanthara : ఆ తప్పు వ‌ల‌న న‌య‌న‌తార అంత‌లా మానసిక వేద‌న చెందుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nayanthara : ఆ తప్పు వ‌ల‌న న‌య‌న‌తార అంత‌లా మానసిక వేద‌న చెందుతుందా?

 Authored By sandeep | The Telugu News | Updated on :25 August 2022,6:40 pm

Nayanthara : న‌య‌న‌తార ఒక‌ప్పుడు స్టార్ స్టేట‌స్‌ని అనుభ‌వించింది.మ‌ధ్య‌లో ప‌లు ప్రేమాయ‌ణాలు న‌డిపిన ఈ ముద్దుగుమ్మ జూన్ 9వ తేదీన ప్రియుడు విగ్నేష్ శివన్‌ని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హీరోయిన్స్ పెళ్ళి చేసుకున్న తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమవుతారు. ఆ తర్వాత అక్క అమ్మ వదిన పాత్రలతో రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటారు. వీరిలో కూడా చాలా తక్కువమందికే మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అవకాశం లభిస్తుంది. ఆమె కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి కమిటవుతుంది. ఇప్పటికే, చేసిన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తున్నాయి. అయితే, నయన్ ఇకపై హీరోయిన్‌గా కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

Nayanthara : మాన‌సిక వేద‌న‌..

పెళ్లి చేసుకున్న ప్రతి హీరోయిన్ కొంత కాలం ఇండస్ట్రీ కి దూరమవుతారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అక్క, వదిన పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తారు. అయితే నయన్ కు ఈ విషయం లో మాత్రం లక్ ఉంది. ఎందుకంటే తన భర్త దర్శక నిర్మాత కావడం విశేషం. కాబట్టి నయన తార హీరోయిన్ గా కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. నయన్ హీరోయిన్ గా కనిపించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా టీజర్ చూస్తే అర్థమవుతుంది.

nayanthara faces lot of issues

nayanthara faces lot of issues

నయన్ ఇందులో ఓ పాత్రను పోషించింది. అయితే, అది హీరోయిన్ పాత్ర కాదు. న‌యనతార రేంజ్‌కి అలాంటి పాత్ర చేయాల్సిన అవసరం కూడా లేదు.అయినా ఒప్పుకుంది. దీన్ని చూస్తే హీరోయిన్ గా చేసే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కు హీరోయిన్ గా ఓ మూవీ చేస్తోంది. ఇక పై నయన్ కి హీరోయిన్ పాత్ర కన్నా కీలకమైన పాత్రలే లభిస్తాయని టాక్ నడుస్తోంది. రానున్న రోజుల‌లో న‌య‌న‌తార ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో కూడా సినిమాలు చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది