Nayanthara : న‌య‌న‌తార‌కి ఆ స‌మస్య ఉందా.. బాధ‌ప‌డుతున్న విఘ్నేష్ శివ‌న్..!

Authored By Sam C | The Telugu News | Updated on: September 4, 2022, 10:41 pm

Nayanthara : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టిగా ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ హీరోల క‌న్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఈ అమ్మ‌డు కొద్ది రోజుల క్రితం విఘ్నేష్ శివ‌న్‌ని పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. దాదాపు అయిదారేళ్లకు పైగా ప్రేమ, సహజీవనం చేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు రెండు నెలల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒకటైంది. రీల్‌ లైఫ్ లో గ్లామర్ క్యారెక్టర్లతో పాటు.. సీరియస్ పాత్రలను కూడా చేసి అలరించిన నయనతార.. రియల్ లైఫ్ లో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తోంది.

Nayanthara : పాపం న‌య‌న్..

పెళ్లి తరువాత ఇప్పటికే రెండు మూడు హనీమూన్లు వెళ్ళి వచ్చారు కోలీవుడ్ రొమాంటిక్ కపుల్. అక్కడ తమ పని తాము చూసుకోకుండా.. హగ్గులు, ముద్దుల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హడావిడి చేశారు. అవి నెట్టింటలో వైరల్‌ అవుతుండటంతో.. ఈ కపుల్ పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏలా ఉన్నా కూడా ఈ జంట ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార పిల్లలకు జ‌న్మ‌నివ్వ‌డం క‌ష్ట‌మ‌ట‌. దానికి కారణం ఆమె హెల్త్ కండిషన్.

Nayanthara Facing Brood Issues With Vignesh Shivan

Nayanthara Facing Brood Issues With Vignesh Shivan

నయనతారకు మొదటి నుంచి గర్భసంచి వీక్ గా ఉందట. దీంతో ఆమె గర్భం దాల్చడానికి చాలా కష్టం అంటున్నారట డాక్టర్స్ . దీంతో ఈ జంట ఓ బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధపడి పెళ్లి చేసుకున్నారట. అయితే నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కనాల‌ని అనుకున్నా కూడా విగ్నేష్ శివన్ దానికి అంగీకరించలేదట . కచ్చితంగా ఓ అనాధ బిడ్డను దత్తత తీసుకొని మనం తల్లిదండ్రులుగా మారాలి అని చెప్పి పెళ్లికి ముందే ఓ అండర్ స్టాండింగ్ కి వచ్చారట. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. అన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా న‌య‌న‌తార అస‌లైన త‌ల్లి ప్రేమ‌ని పొంద‌లేదా, ఇలాంటి ప‌రిస్థితి న‌య‌న‌తార‌కే ఎందుకొచ్చింద‌ని కొంద‌రు అభిమానులు ఆందోళ‌న చెందుతున్న‌ట్టుగా తెలుస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp