Nayanthara : స్టార్ హీరోలకు కూడా లేని రేంజ్ నయనతారది.. ఇదుగో ప్రూఫ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nayanthara : స్టార్ హీరోలకు కూడా లేని రేంజ్ నయనతారది.. ఇదుగో ప్రూఫ్

Nayanthara : సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారకు ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన నయనతార , ఆ తర్వాత తమిళ భాషలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు భాషలలో అవకాశాలు అందుకున్న నయనతార ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తెలుగులోనే. దాంతో సౌత్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న స్టార్ హీరోయిన్‌గా నయన్ హాట్ టాపిక్ అయింది. చెప్పాలంటే ఇప్పుడు సౌత్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 July 2022,10:00 am

Nayanthara : సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారకు ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన నయనతార , ఆ తర్వాత తమిళ భాషలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు భాషలలో అవకాశాలు అందుకున్న నయనతార ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తెలుగులోనే. దాంతో సౌత్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న స్టార్ హీరోయిన్‌గా నయన్ హాట్ టాపిక్ అయింది. చెప్పాలంటే ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ హీరోలకు ఏ రేంజ్ ఉందో అదే రేంజ్ అమ్మడికీ ఉంది.

నయనతార హీరోయిన్ అంటేనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. మూవీ ప్రమోషన్స్‌కు నయన్ రాదు. పైగా భారీ రెమ్యునరేషన్. ఒక్కసారి తన డేట్స్ గనక మేకర్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ ఇవ్వడం చాలా కష్టం. అంత బిజీగా నయన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. జూన్ 9న ఘనంగా పెళ్లి చేసుకున్న నయన్ మళ్ళీ పెద్ద గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్స్‌లో జాయిన్ అయిపోయింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్, బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలలో నటిస్తోంది. అయితే, ఇవి పెళ్లికి ముందే కమిటైన సినిమాలు కదా అందుకే కంప్లీట్ చేస్తుంది తప్ప కొత్త ప్రాజెక్ట్స్ ఇక కమిటవదని ప్రచారం జరిగింది.

Nayanthara has a range that even star heroes don't have Here is the proof

Nayanthara has a range that even star heroes don’t have Here is the proof

Nayanthara : సర్‌ప్రైజింగ్ అప్‌డేట్.. స్వీట్ షాక్

కానీ, దానికి ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చి స్వీట్ షాక్ ఇచ్చింది. తన 75వ సినిమాను నయనతార తాజాగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంస్థలో నయన్ కొత్త మూవీ కమిటైంది. తాజాగా ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఈ మేరకు మేకర్స్ సాలీడ్ వీడియోతో ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఇక అతి త్వరలో ఈ నయనతార 75వ సినిమాను సెట్స్ మీదకు తీసుకు రానున్నారు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ వద్ద దర్శకత్వ విభాగంలో పని చేసిన నీలేష్ కృష్ణా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. కాగా, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ మేకర్స్ వెల్లడించనున్నారు. ఇక నయనతార బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ చేస్తున్న జవాన్ గనక భారీ హిట్ సాధిస్తే అక్కడ నుంచి కూడా వరుసగా సినిమాలు వెబ్ సిరీస్‌లలో నటించే అవకాశాలను ఖచ్చితంగా దక్కించుకుంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది