Home » Entertainment » Nayanthara Huge Remuneration For Balakrishna Movie
Entertainment

Nayanthara : గాడ్‌ ఫాదర్ కి రూ.3 కోట్లు, బాలయ్య సినిమాకి రూ.6 కోట్లు.. ఇదెక్కడి నయనతార

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 8, 2022, 10:00 pm
Advertisement

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం నయన తార మూడు కోట్ల రూపాయల పారితోషికమును తీసుకుంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిబోతున్న సినిమా కోసం ఆమెను సంప్రదిస్తే ఏకంగా రూ. 6 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేసింది అంటూ తమిళ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Advertisement

చిరంజీవి సినిమాకు మూడు కోట్లు తీసుకొని ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు రూ. 6 కోట్లు డిమాండ్ చేయడం ఏంటో అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి అభిమానులు ఇదెక్కడి న్యాయం.. వాళ్లకు ఒక రేటు మా హీరోకి ఒక రేటు ఏంటి అంటూ నయనతారని ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ మరియు చిరంజీవి సమాన స్థాయి హోదా ఉన్న హీరోలు వారితో కలిసి నటించేందుకు సమానమైన పారితోషికం తీసుకోవాలని ఇలా ఎక్కువ తక్కువ పారితోషికం తీసుకోవడం ఎక్కడి న్యాయం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే నయనతారకు ఇటీవలే ప్రియుడు విగ్నేష్ శివన్‌ తో పెళ్లి అయింది. పెళ్లి తర్వాత నయనతార సినిమాల సంఖ్య తగ్గించుకోవాలని భావిస్తుంది.

Nayanthara huge remuneration for balakrishna movie

Advertisement

అయితే భారీ గా పారితోషికం పెంచి ఆ పారితోషికానికి ఓకే అనే వాళ్లకు మాత్రమే తన డేట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెను సంప్రదించిన సమయంలో ఆరు కోట్ల రూపాయల పారితోషికమును డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఆమె నటించేందుకు ఆసక్తిగా లేకపోవడం వల్లే ఏకంగా ఆరు కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో తప్పని పరిస్థితిలో మరో హీరోయిన్ వైపు అనిల్ రావిపూడి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి