Nayanthara : సరోగసి వలన నయనతార దంపతులకి 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుందా?
Nayanthara : నయనతార- విఘ్నేష్ శివన్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో అప్పటి నుండి వీరిని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.తిరుమలకు చెప్పులతో వెళ్లిందని అప్పుడు నానా రచ్చ చేశారు. ఇక సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వగా ఇప్పుడు ఈ విషయం కూడా వివాదాస్పదంగా మారింది. పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు వీరుఇటీవల వెల్లడించారు. సరోగసీ విధానంతో వీరు తల్లిదండ్రులు అయ్యారు. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే సరోగసీ విధానం. దీనిపై 2019లోనే సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది. ఈ పద్ధతి ద్వారా పిల్లలను కనడం నేరమని తీర్పును వెలువరించింది.
సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే నయనతార, విఘ్నేష్ లకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పిల్లలను దత్తత తీసుకోవాలంటే లీగల్ గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. చట్ట పరంగా దత్తత తీసుకుంటే పర్వాలేదు… లేని పక్షంలో చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. ప్రస్తుతం ఈ విషయంలో నానా రచ్చ జరుగుతుంది. ఈ ట్రోలింగ్ నేపథ్యంలో విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
Nayanthara : శిక్ష ఖాయమా?
నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, నీతోనే ఉంటూ, నీకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించే వారి గురించి మాత్రమే ఆలోచించాలని విఘ్నేశ్ అన్నారు. నీ గురించి తపన పడే వాళ్లే నీ వాళ్లు అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్నీ నీ వద్దకు చేరుతాయని… అప్పటి వరకు సహనంతో ఉండాలని అన్నారు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే తమకు కవల పిల్లలు జన్మించినట్టు విఘ్నేష్ శివన్ నిన్న (అక్టోబర్ 9న) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ ప్రార్థనలు, తమ పూర్వీకుల ఆశీర్వాదాలతో కవల మగ పిల్లలు జన్మించారని పేర్కొన్నారు. వారికి ఉయిర్, ఉళగమ్ అని పేర్లు కూడా పెట్టారు.