Nayanthara : త‌మ వివాహంపై ఎట్ట‌కేల‌కు స్పందించిన న‌య‌నతార ప్రియుడు

Authored By Sam C | The Telugu News | Published on: June 8, 2022, 12:00 pm

Nayanthara : కొన్నాళ్లుగా ప్రేములో మునిగి తేలుతున్న న‌య‌న‌తార ఎట్ట‌కేల‌కు వైవాహ జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త కొన్నాళ్లుగా ప్రేమ‌లో విహ‌రిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లి పీట‌లు ఎక్కేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు న‌య‌న్‌. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ స్టార్ కపుల్ గా మారబోతున్నారు. ఈ మేరకు గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నెల రోజుల నుంచి తమ వివాహా వేడుకకు సిద్ధం అవుతున్నారు. ఈ సందర్బంగా పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లును పూర్తి చేస్తున్నారు. జూన్ 9న తమిళ నాడులోని మ‌హాబ‌లిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్లో ఈ కోలీవుడ్ జంట ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం.

హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వీరి వివాహం జరగనుంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​కు కలిసిన నయన్-విఘ్నేష్​ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వారి పెళ్లి ఖరారు అయిందని కన్ఫర్మ్ చేసుకుంది సినీ లోకం. కానీ వీరి ఇద్దరి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా వీరి వివాహంపై స్పందించాడు విఘ్నేష్ శివన్​. ‘నా ప్రేయసి​ నయనతారను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్​ 9 (గురువారం) నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. నిజానికి ముందుగా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం.

Nayanthara lover gives clarity about their marriage

Nayanthara lover gives clarity about their marriage

Nayanthara : క్లారిటీ ఇచ్చారుగా..

కానీ అక్కడ ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉంటాయనిపించడంతో మా వివాహ వేదికను మహాబలిపురానికి మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నం షేర్​ చేస్తాం. జూన్​ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాం. ఇప్పుడు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపాడు విఘ్నేష్ శివన్​. కోలీవుడ్ నుంచి క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జినీ కాంత్, చిరంజీవి, అజిత్, విజ‌య్, సూర్య, కార్తీల‌తో సహా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా పెళ్ళికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అయితే కోలీవుడ్ లో జరుగుతున్న స్టార్ వెడ్డింగ్ కావడంతో వేడుకను ఓటీటీలో ప్రసారం చేసేందుకు ప్లాన్ చేశారంట.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp