Nayanthara : నయనతార చేసిన తప్పులే ఆమెను వెంటాడుతున్నాయా..?
Nayanthara : స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఇబ్బందుల్లో పడింది. ఓ వైపు కవలపిల్లలు తమ జీవితంలోకి వచ్చారన్న ఆనందం లేకుండా పోయిందని బాధపడుతోందట.. ఎందుకంటే సరోగసి ద్వారా విఘ్నేశ్ దంపతులు కవలపిల్లలకు జన్మినిచ్చిన విషయం తెలిసిందే. దీని మీద ప్రస్తుతం పెద్ద ఇష్యూ నడుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం దీని సీరియస్ అయ్యింది. త్వరలోనే దీని మీద విచారణ జరగనుంది. నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు.
చాలా కింది నుంచి పై స్థాయికి ఎదిగింది. ఇక అగ్రహీరోయిన్‌గా ఎదిగాక ఆమె పరిస్థితి చాలా మెరుగయ్యింది. నటిగా ఎంత పేరు సంపాదించుకుందో ఆమె పర్సనల్ లైఫ్ మొత్తం ఆమె జీవితాన్ని తలకిందులు చేసిందని చెప్పుకోవచ్చు. హీరో శింబుతో కొంత కాలం రొమాన్స్ చేసిన నయన్ ఆ తర్వాత ప్రభుదేవాతో డేటింగ్ చేసింది. వీరిద్దరూ కలిసి పెళ్లిచేసుకుందామని ట్రై చేశారు. కానీ అది నేరవేరలేదు. ప్రభుదేవాతో కలిసి నయన్ కొంతకాలం సహజీవనం చేసిందని వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరూ కలిసి జంటగా తిరిగే సమయంలో మీడియా కూడా ఫోకస్ చేసింది.

Nayanthara mistakes are haunting her
Nayanthara : ఆ స్టార్ భార్య పెట్టిన శాపం వల్లేనా..
నిజంగానే వీరు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. ప్రభుదేవా కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలని చూశాడట. దీంతో అతని భార్య కేసు పెట్టేందుకు వెళ్లడంతో తగ్గాడు. ఈ క్రమంలోనే నయనతారను ప్రభుదేవా భార్య నానా మాటలు అన్నది. నా కాపురంలో నిప్పులు పోసిన నీకు శాపం తప్పకుండా తగులుతుందని ఫైర్ అయ్యింది. నువ్వు సర్వనాశనం అయిపోతావు అని కూడా శాపనార్దాలు పెట్టిందట.. నా ఉసురు తగులుతుందని, నా కన్నీటికి కారణం నువ్వే అని అనడంతో పాటు నీ జీవితంలో ఏడ్చే రోజులు వస్తాయని బూతులు తిట్టిందట.. ఆ శాపమే నయన్‌కు ఇప్పుడు తగిలి ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.