Nayanthara : వామ్మో.. సిస్టర్ రోల్ కోసం నయనతార ఇంత రెమ్యూనరేషన్ తీసుకుందా..?

Authored By mallesh | The Telugu News | Published on: October 5, 2022, 4:20 pm

Nayanthara : హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగు, తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ తన సత్తా చాటుతోంది నయన్..నాలుగు పదుల వయస్సుదాటినా హీరోయిన్‌గా ఈ అమ్మడు నేటికి అవకాశాలు దక్కించుకుంటోంది. మొన్నటివరకు లేడి ఓరియెంటెడ్ పాత్రలు చేసిన నయనతార.. ఇటీవల తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌‌ను వివాహం చేసుకుంది. తన భర్త కోసం ఏకంగా రూ.20కోట్లకు పైగా వెచ్చించి ఒక బంగ్లాను కొనుగోలు చేసి గిఫ్ట్ ఇచ్చిందని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. నయన్ తార ఇండస్ట్రీలో సీనియర్ కావడంతో బడా హీరోల సరసన హీరోయిన్‌గా ఈమెను ఎంపిక చేస్తున్నారు దర్శకనిర్మాతలు..

తమిళం, తెలుగులో ఉన్న సీనియర్ హీరోలకు నయన్ ఒక్కతే దిక్కులా కనిపిస్తోందట.. మిగతా హీరోయిన్లు పెద్ద హీరోల సరసన నటించేందుకు నో చెబుతున్నారు. ఇప్పటికే నయన్ తెలుగులోని బడా హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీలో ఆయనకు చెల్లెలి రోల్ చేసేందుకు ఓకే చెప్పింది ఈ బ్యూటీ.. గతంలో చిరు సరసన హీరోయిన్ గా చేసిన నయన్.. గాడ్ ఫాదర్ మూవీలో సిస్టర్ రోల్ చేసేందుకు ముందు నో చెప్పిందట.. కానీ అందుకు ఆమె అంగీకరించలేదట.. చిరుకు సిస్టర్ రోల్ చేస్తే మరల ఆయన పక్కన హీరోయిన్ గా చేస్తే ప్రేక్షకులు అంగీకరించని తెలిపిందట..

Nayanthara remuneration for the role of sister

Nayanthara remuneration for the role of sister

Nayanthara : తన కెరీర్ లోనే టాప్ రెమ్యూనరేషన్

చివరకు మెగాస్టార్ రిక్వెస్ట్ మేరకు ఈ క్యారెక్టర్ చేసేందుకు ఓకే చెప్పిందట.. కానీ అందుకోసం చాలా కండిషన్స్ పెట్టిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు గాడ్ ఫాదర్ మూవీ మార్నింగ్ షో టాక్ వచ్చింది. ఇందులో నయన్ రోల్ చాలా చప్పగా ఉందట.. చిరును హైలెట్ చేసేందుకు దర్శకుడు మోహన్ రాజా ఆమె పాత్రను తక్కువచేసి చూపించారట.. మళయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ కు తెలుగు రీమెక్ గాడ్ ఫాదర్.. అందులో హీరో మోహన్ లాల్‌ చెల్లెలి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇక తెలుగులో నయన్ ఈ పాత్ర కోసం ఏకంగా రూ.7కోట్లు తీసుకుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే నిజమైతే తన కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని అంటున్నారు విశ్లేషకులు..

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp