Nayanthara stunning comments on vinayak
Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోలందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా ఈ అమ్మడు సినిమాలలో తప్ప ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పెద్దగా కనిపించదు. చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతార తర్వాత మీడియా ముందుకు రాగా, ఆమెను సుమని వరుస పెట్టి ప్రశ్నలు అడిగింది. కనెక్ట్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండగా, దాదాపు 10ఏళ్ల తర్వాత నయన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వగా, ఇందులో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర ఆన్సర్స్ ఇచ్చింది నయన్. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి,
రవితేజ, బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ప్రభాస్ చిన్న పిల్లొడి మనస్తత్వం అని చెప్పిన నయన్.. అతని అల్లరిని తట్టుకోవడం చాలా కష్టమని అంది. అతనని పాన్ ఇండియా స్టార్‌గా చూడడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక రవితేజ గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అని.. సెట్ లో హిందీలో ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లమని చెప్పుకొచ్చింది. తారక్ రిహారల్స్ లేకుండానే టేక్ కీ వెళ్లిపోదామని అంటారు. నిజంగా ఆయన చాలా టాలెంటెడ్ అంటూ చెప్పుకొచ్చింది నయన్. అలాగే తనతో పని చేసిన వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవిపై కూడా ప్రశంసలు కురిపించింది. అయితే నయనతార సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై క్రియేట్ అయిన మీమ్స్ పై సుమ నయనతార దగ్గర ప్రస్తవించింది…
Nayanthara stunning comments on vinayak
నయనతారకి కవల పిల్లలు జన్మించడంతో అదుర్స్ చిత్రంలోని సన్నివేశాలు మీమ్స్ రూపంలో తెగ హల్‌చల్ చేశాయి. అదుర్స్ మూవీలో బ్రహ్మి బిట్టు పాత్రలో నటించగా, ఇందులో నయన్‌తో కలిసి ఆయన నటించిన సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయి. నయన్ విగ్నేష్ వివాహం జరిగినప్పుడు.. బిట్టు బాధపడడం.. పిల్లలు పుట్టినప్పుడు వారిని ఆడించడం లాంటి అంశాలని అదుర్స్ చిత్రంలో లింక్ చేస్తూ నెటిజన్లు చాలా ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేశారు. అయితే నయన్‌కి , రియల్ లైఫ్ కవలపిల్లలు జన్మించడం యాదృచ్చికంగా జరగగా, బహుశా నాకు కవల పిల్లలు పుడతారని వివి వినాయక్ సర్ కి ముందే ఊహించారేమో అంటూ నయన్ సరదాగా స్పందించింది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.