
Nayanthara : నయనతార, విఘ్నేష్ శివన్‌లకి ఘోర అవమానం.. రెస్టారెంట్‌లో 30 నిమిషాల పాటు లైన్‌లో...!
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా కంటే.. నయనతార భర్తగానే ఎక్కువ పేమస్ అవుతున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. నానుం రౌడీ ధాన్’ సెట్స్‌లో ప్రేమలో పడి, ఏడేళ్లు సహజీవనం తర్వాత 2022లో వివాహం చేసుకున్నారు.పెళ్లైన నాలుగు నెలల తర్వాత, విఘ్నేష్ శివన్, నయనతార సరోగసీ ద్వారా కవల పిల్లలు పొందారు. వారి పేర్లు ఉయిర్, ఉలగ్. పెళ్లి తర్వాత ఇద్దరూ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యే తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఢిల్లీకి వెళ్లింది.
Nayanthara : నయనతార, విఘ్నేష్ శివన్‌లకి ఘోర అవమానం.. రెస్టారెంట్‌లో 30 నిమిషాల పాటు లైన్లో…!
అక్కడి కాకే దా హోటల్ లో నార్త్ ఇండియన్ తందూరి టేస్ట్ చేయడానికి నయన్, విఘ్నేష్ సుమారు అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చింది. నవంబర్ 18న నయన్ బర్త్ డే జరుపుకోవడానికి తాము ఢిల్లీ వెళ్లినట్లు విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచినా నయనతార మాత్రం ఈ డిన్నర్ డేట్ కు భర్తతో కలిసి ఓ సాధారణ జంటలాగే వెళ్లింది. ఆ రెస్టారెంట్ చాలా బిజీగా ఉండటంతో టేబుల్ కోసం ఈ జంట చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడి ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను రెస్టారెంట్ లోని వ్యక్తి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ డిన్నర్ డేట్, వీడియోపై విఘ్నేష్ శివన్ స్పందించాడు. “నవంబర్ 17న ఓ చిన్న బర్త్ డే ఈవెనింగ్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లాం. ఆ క్షణాన్ని క్యాప్చర్ చేసిన ఓ అపరిచిత వ్యక్తికి థ్యాంక్స్” అని అతడు అన్నాడు. ఫుడ్ చాలా టేస్టీగా ఉందన్న విఘ్నేష్.. టేబుల్ కోసం అరగంటపాటు లైన్లో వేచి ఉన్నట్లు చెప్పడం విశేషం. ఈ వీడియోలో ఈ సెలబ్రిటీ కపుల్ ఒకరికొకరు తినిపించుకోవడం కనిపించింది. హిందీలో జవాన్ లాంటి సినిమాలో షారుక్ ఖాన్ తో కలిసి నటించి నార్త్ లోనూ నయన్ మంచి పేరు సంపాదించుకుంది. ఎంతో బిజీగా ఉన్న రెస్టారెంట్ కు వెళ్లి అందరి మధ్యలో కూర్చొని తినడం అక్కడి వాళ్లను ఆకర్షించింది. ఇక పబ్లిక్ లోనూ ఎలాంటి అవాంతరాలు లేకుండా నయన్, ఆమె భర్త డిన్నర్ చేయడం చూస్తుంటే బాగా అనిపిస్తోందని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.