Neha Shetty : రాధికా నీకిదేమైనా బాగుందా.. జాలి దయా లేదా.. ఇలా రెచ్చిపోతే టిల్లు గాళ్ల పరిస్థితి ఏంటి..?

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 25, 2022, 6:40 pm

Neha Shetty : అంతకుముందు ఒకటి రెండు సినిమాల్లో చేసినా సరే రాన్ క్రేజ్ డీజే టిల్లుతో సంపాదించింది హీరోయిన్ నేహా శెట్టి. డీజే టిల్లులో సిద్ధుతో ఆమె జోడీ అదరగొట్టింది. రాధిక పాత్రలో నేహా శెట్టి చేసిన అభినయం అందరిని మెప్పించింది. ఇక డీజే టిల్లు 2లో ఆమెని తప్పించి అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నట్టు తెలుస్తుంది. డీజే టిల్లు 2 షూటింగ్ ఈమధ్యనే స్టార్ట్ అయ్యింది. దానికి సంబందించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. డీజే టిల్లుతో వచ్చిన ఈ క్రేజ్ ని వాడుకుంటుంది నేహా. ఆ సినిమా హిట్ తో ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

అంతకుముందు సినిమాలైతే చేసినా అమ్మడికి సరైన ఐడెంటిటీ రాలేదు కానీ టిల్లు గాడి వల్ల రాధిక పాత్రలో చేసిన నేహాకి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరోపక్క సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్ తో అదరగొడుతుంది నేహా శెట్టి. దీపావళి సందర్భంగా స్లీవ్ లెస్ టాప్ తో ఎట్రాక్ట్ చేస్తుంది నేహా శెట్టి. తనదైన శైలిలో అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది అమ్మడు.

neha shetty latest photoshoot crazy

neha shetty latest photoshoot crazy

తనకు వచ్చిన ఈ పాపులారిటీని డబుల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా హాట్ షోస్ తో అదరగొట్టేస్తుంది నేహా. రాధికా ఇలా రెచ్చిపోతే బయట ఉన్న టిల్లు గాళ్ల పరిస్థితి ఏంటన్నది అర్ధం చేసుకోవాలి. అందుకే అమ్మడి ఫోటోలకు రాధికా నువ్వు ఇలా చేయడం ఏమైనా న్యాయం గా ఉందా కొద్దిగా కూడా జాలి లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డీజే టిల్లు 2లో రాధిక అదే నేహా శెట్టి లేదని అంటున్నారు కానీ సినిమాలో కొద్దిసేపు ఆమె ప్రస్థావన ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి రాధిక చేస్తున్న ఈ హంగామా ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. నేహా శెట్టి ఈమధ్యనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో జొమాటో యాడ్ చేసింది.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp