Special Song | పవన్ కళ్యాణ్ ‘OG’ స్పెషల్ సాంగ్ మిస్సింగ్.. నేహా శెట్టి సాంగ్ ఎడిటింగ్ లో తీసేశారా?
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him OG)’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ షోలు మొదలై అప్పటి నుంచే సినిమా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకుంది. పవన్ కొత్త లుక్, మాస్ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

#image_title
స్కోప్ లేకపోవడంతో..
ఇప్పటికే అభిమానులు సినిమా మీద ఫుల్ హ్యాపీగా స్పందిస్తున్నా, ఒక చిన్న నిరాశ మాత్రం కొందరిలో కనిపిస్తోంది. అదేంటంటే ముందస్తుగా ప్రచారం అయిన స్పెషల్ సాంగ్ మిస్ కావడం. సినిమా రిలీజ్‌కు ముందు నుండి, అందరిలో ఆసక్తిని రేపిన అంశం నేహా శెట్టి స్పెషల్ సాంగ్. ఈ విషయం నేహా శెట్టి స్వయంగా ఓ ఈవెంట్‌లో చెప్పడం, మీడియా రిపోర్ట్స్‌లో సైతం ఈ సాంగ్ గురించి చర్చ జరగడం వల్ల అభిమానుల్లో ఓ ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే, సినిమాను థియేటర్లో చూసినవారు ఊహించని విషయాన్ని గమనించారు. నేహా శెట్టి కనిపించలేదు. స్పెషల్ సాంగ్ అసలు లేనేలేదు! దీన్ని చూసిన ప్రేక్షకులు, “ఈ సాంగ్ షూట్ అయినా తర్వాత ఎడిటింగ్ లో తీసేసారా?” అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా ఉండటంతో ఓ ప్రత్యేక సాంగ్ కి అవకాశం లేనట్టు స్పష్టమవుతోంది. దాంతో మేకర్స్ ఈ సాంగ్‌ను ఫైనల్ కట్ లో నుంచి తీసేసే అవకాశం ఉంది.