Dhoni – Virat Kohli : ధోనీ, విరాట్ కోహ్లీ ఇంకా 10 మంది టాప్ క్రికెటర్ల సంపాదన ఎంతో తెలిస్తే నిద్ర పట్టదు..!
Dhoni – Virat Kohli : వేరే దేశాల్లో ఏమో కానీ.. భారత్ లో మాత్రం క్రికెట్ అంటే పడి చచ్చిపోతారు జనాలు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ కు వీర ఫ్యాన్స్ ఉన్నారు. క్రికెట్ అంటేనే ఒక జీవితం. చాలామంది క్రికెట్ చూడటం కోసం, మ్యాచ్ కోసం ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. మరోవైపు క్రికెట్ టీమ్ లో చేరాలని చాలామంది ఆశపడుతుంటారు. దాని కోసం చాలా సాధన చేస్తారు. కొందరు రంజీ స్థాయి వరకే ఆగిపోతారు. మరికొందరు నేషనల్ స్థాయికి వెళ్తారు.
ఒక్కసారి నేషనల్ టీమ్ లో సెలెక్ట్ అయ్యారంటే ఇక వాళ్ల జీవితాలు మారిపోయినట్టే. లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ అయినట్టే.తమ ప్రతిభను క్రికెట్ లో చూపిస్తే ఇక బీసీసీఐ నుంచి భారీగా డబ్బులు వస్తాయి. కోట్లలో జీతాలు, ఇతర బోనస్ లు, వాణిజ్య ప్రకటనలు.. అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. నిజానికి క్రికెట్ లో ఒక ట్రెండ్ ను సృష్టించింది సచిన్ టెండుల్కర్. ఆయన్నే ఆ తర్వాత వచ్చిన చాలామంది క్రికెటర్లు ఫాలో అవుతున్నారు. ధోని కావచ్చు.. విరాట్ కోహ్లీ కావచ్చు.. ఇలా చాలామంది అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
Dhoni – Virat Kohli : రిచ్ క్రికెటర్లు గా ఎదిగిన చాలామంది క్రికెటర్లు
సచిన్, ధోనీ, విరాట్ కోహ్లీ, గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్, రోహిత్ శర్మ్.. ఇలాంటి వాళ్లంతా ఆల్ టైమ్ రిచ్ క్రికెటర్లుగా ఎదిగారు. ప్రస్తుతం టాప్ 10 లో సచిన్ టెండుల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన సంపాదన ఏకంగా రూ.1120 కోట్లుగా ఉంది. రెండో స్థానంలో ధోనీ ఉన్నాడు. ఆయన ఆస్తులు రూ.850 కోట్లు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఆయన ఆస్తులు రూ.700 కోట్లు. నాలుగో స్థానంలో సౌరవ్ గంగూలీ ఉండగా, ఆయన ఆస్తి రూ.375 కోట్లు. వీరేంద్ర సేహ్వాగ్ రూ.334 కోట్లు, యువరాజ్ సింగ్ రూ.260 కోట్లు, సురేశ్ రైనా రూ.185 కోట్లు, రాహుల్ ద్రవిడ్ రూ.172 కోట్లు, రోహిత్ శర్మ రూ.160 కోట్లు, గౌతమ్ గంభీర్ రూ.150 కోట్లు ఉన్నాయి.