Sachin | స‌చిన్ టెండూల్క‌ర్‌కి ఆ సినిమా బాగా న‌చ్చిందా.. ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sachin | స‌చిన్ టెండూల్క‌ర్‌కి ఆ సినిమా బాగా న‌చ్చిందా.. ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుంది?

 Authored By sandeep | The Telugu News | Updated on :27 August 2025,1:00 pm

Sachin | క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, సచిన్ టెండూల్కర్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ‘క్రికెట్ దేవుడు’గా ఖ్యాతి పొందిన మాస్టర్ బ్లాస్టర్, ఆటను వీడిన తర్వాత సామాజిక సేవ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, తీరిక దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

#image_title

సచిన్ మెచ్చిన చిత్రం..

తాజాగా సచిన్, తన సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రెడ్డిట్ AMA (Ask Me Anything) సెషన్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ… తనకు నచ్చిన ఇటీవలీ సినిమాల గురించి వెల్లడించారు. ఓ యూజర్‌ అడిగిన “మీ ఫేవరెట్ మూవీ ఏదీ?” అన్న ప్రశ్నకు సచిన్ స్పందిస్తూ, “టైమ్ దొరికినప్పుడు సినిమాలు చూస్తుంటాను. రీసెంట్‌గా నాకు బాగా నచ్చిన సినిమాలు ‘3BHK’ (తమిళం), ‘ఆట తంబాయ్చా నాయ్’ (మరాఠీ)” అని తెలిపారు.

సచిన్ టెండూల్కర్ నుంచి పొగడ్తలందుకోవడం అంటే ఏ దర్శకుడికైనా గర్వకారణమే. ఇదే గర్వాన్ని వ్యక్తపరిచాడు ‘3BHK’ దర్శకుడు శ్రీ గణేష్. సోషల్ మీడియా వేదికగా సచిన్‌కు థ్యాంక్స్ చెబుతూ, “మీరు మా బాల్య హీరో సర్! మీ నుంచి ఈ ప్రశంసలు రావడం మా సినిమా కోసం చాలా గొప్ప విషయం” అంటూ ఎమోషనల్ అయ్యారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది