Acharya : తప్పదు మరి లాసైనప్పుడు తిరిగిచ్చేయాల్సిందే..ఆచార్య మేకర్స్‌పై కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acharya : తప్పదు మరి లాసైనప్పుడు తిరిగిచ్చేయాల్సిందే..ఆచార్య మేకర్స్‌పై కామెంట్స్..!

 Authored By govind | The Telugu News | Updated on :5 May 2022,10:00 am

Acharya: తప్పదు మరి లాసైనప్పుడు తిరిగిచ్చేయాల్సిందే.. అంటూ నెటిజన్స్ ఆచార్య మేకర్స్‌పై కామెంట్స్ చేస్తున్నారు. అవును..ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెగా మల్టీస్టారర్ ఆచార్య. కెరీర్‌లో 4 బ్లాక్ బస్టర్స్ తీసిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా దాదాపు రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అటు మెగాస్టార్, ఇటు మెగా పవర్ స్టార్ ఉన్నారంటే సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో అని ప్రతీ ఒక్కరు గొప్పగా చెప్పుకున్నారు.కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆచార్య ఒకే ఒక్క షోతో ఫ్లాప్ అని తేల్చేశారు అభిమానులు.

మెగా అభిమానులే ఈ సినిమా చూసి తీవ్ర నిరాశ చెందారంటే, ఇక కామన్ ఆడియన్స్ ఎంతగా డిసప్పాయింట్ అయి ఉంటారో ఊహించుకోవచ్చు. కొంతమందైతే ఇది కొరటాల స్క్రిప్టేనా..ఆయన దర్శకత్వం వహించిన సినిమానేనా..అంటూ సందేహాలను వ్యక్తం చేశారు. అంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమా అంటే నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్స్ భారీగా ఖర్చు చేస్తారు.కానీ, దానికి తగ్గట్టుగా గనక లాభాలు రాకపోతే మళ్ళీ ఇండస్ట్రీలో కనిపించరు. అందుకే, మన హీరోలు సాధ్యమైనంతవరకు నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్‌నుఆదుకునేందుకు ఏమాత్రం వెనకాడరు.

netizens comments on acharya makers

netizens comments on acharya makers

Acharya: కొరటాల శివ రాసిన డైలాగ్‌ను కాస్త మార్చి ..!

ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు చరణ్ ..తాము తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి సగాని తిరిగి నిర్మాతకు ఇచ్చేయగా..ఆ మొత్తాని మరీ దారుణంగా లాసైన డిస్ట్రిబ్యూటర్స్‌కు సర్దుబాటు చేశారట. దీనిలో భాగంగానే దర్శకుడు కొరటాల శివ కూడా తాను తీసుకున్న రెమ్యునరేషన్‌లో మళ్ళీ సగం రెమ్యునరేషన్ తిరిగిచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్‌కు సపోర్ట్ చేసినట్టు తాజాగా ఇండస్ట్రీ వర్గాల లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. దాంతో శ్రీమంతుడు సినిమాలో దర్శకుడు కొరటాల శివ రాసిన డైలాగ్‌ను కాస్త మార్చి లాసైనప్పుడు తిరిగిచ్చేల్సిందే..తప్పదు మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారట.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది