new doubts on mahesh-trivikram movie
Mahesh – Trivikram: సూపర్ స్టార్ మహేశ్ బాబు – మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా చిత్రాలొచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన సక్సెస్ సాధించలేదు. అయితే, మహేశ్ బాబును త్రివిక్రమ్ స్క్రీన్ మీద చూపించిన దానికి అభిమానులే కాదు అందరూ ఫిదా అయ్యారు. ఇక మహేశ్ బాబుకు కూడా త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ కథ, కథనం తయారు చేసే విధానం బాగా నచ్చాయి.
అందుకే, ముందు రెండు చిత్రాల ఫలితం కాస్త తేడాగా వచ్చినా కూడా మూడవ సినిమా అవకాశం ఇచ్చాడు. సాధారణంగా మహేశ్ ఫ్లాపుల్లో ఉన్న దర్శకులను దగ్గరికి రానివ్వడనే టాక్ ఉంది. అంతేకాదు, తనకు ఫ్లాపు ఇచ్చిన దర్శకుడికు కూడా అంత త్వరగా మరోసారి ఛాన్స్ ఇవ్వడని చెప్పుకుంటుంటారు. ఆ రకంగా చూస్తే మాత్రం త్రివిక్రమ్ లక్కీ అని చెప్పాలి. వాస్తవంగా త్రివిక్రమ్ ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు కమిటయ్యాడు. కానీ, అనుకోని కారణాల వల్ల తారక్ ప్రాజెక్ట్ వదిలేసి మహేశ్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు.
new doubts on mahesh-trivikram movie
ఇది కూడా అనుకున్నంత పక్కాగా స్క్రిప్ట్ విషయంలో అడుగులు ముందుకు పడటం లేదనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ మూవీకి త్రివిక్రమ్ రచనతో సహా ప్రాజెక్ట్‌కు ఏం కావాలో అవన్నీ చూసుకున్నాడు. ఈ సినిమా భారీ హిట్ సాధించింది. దాంతో వరుసగా మరో మూడు రీమేక్ సినిమాల బాధ్యతను పవన్ త్రివిక్రమ్ కి అప్పగించారట. వాటి పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. మహేశ్‌తో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్‌ను ఇంకా కంప్లీట్ చేయలేదని సమాచారం. జూన్ లేదా జూలై నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, ఇప్పటివరకు త్రివిక్రమ్..ఫుల్ స్క్రిప్ట్ మహేశ్‌కు నరేట్ చేయలేదట. దాంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా లేటవుతుందా లేదా మరో దర్శకుడితో మహేశ్ కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటాడా అని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చలు సాగుతున్నాయి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.